దుత్తలూరు
1-3-2026
స్థానిక నందిపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కొట్టె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
: కొట్టె వెంకటేశ్వర్లు గ్రామస్తులతో నేరుగా మాట్లాడి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జనసేన పార్టీ ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ‘ఉద్యమి’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు,నియోజకవర్గ అభివృద్ధి కోసం యువత రాజకీయాల్లోకి రావాలని, మార్పు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
”ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే జనసేన లక్ష్యం. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తాం.” – కొట్టె వెంకటేశ్వర్లు
కార్యక్రమంలో పాల్గొన్న వారు:
ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల కన్వీనర్స్థా దుంపలగడ్డ రవి గారూ, మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





