ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నాగుల చవితి పర్వదినం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది.
ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్య రియల్ ఎస్టేట్ కాలనీలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగ ప్రతిమలకు ఆవుపాలు, కుంకుమ, పసుపుతో అభిషేకాలు చేశారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, ఆలయ పరిసరాలు భక్తి గీతాలతో మార్మోగాయి.
పూజారి శ్రీ లక్ష్మణాచార్యులు భక్తుల గోత్రనామాలతో అభిషేకాలు జరిపి స్వామి అనుగ్రహం కోసం పూజలు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలి వచ్చి సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేసుకున్నారు.
నాగుల చవితి సందర్భంగా భక్తులు స్వామివారిని వేడుకొని తమ మనోకాంక్షలు నెరవేరాలని ప్రార్థించారు.అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు ఇచ్చి భక్తులకు స్వామి వారి అనుగ్రహ దీవెనలు అందించారు.
ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు భక్తులకు తెలియజేసినది ఏమనగా ది.26.11.2025న బుధవారం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం జరుగుతుంది. కావున భక్తులు తమ శక్తి కొలది స్వామివారికి ఆర్ధిక మరియు వస్తువులు ధాన్య రూపేన సహకరించగలరు. సంప్రదించవలసిన నెంబర్ 9866308251 భక్తులు వచ్చి తీర్ధ ప్రసాదాలు అన్నప్రసాదము స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందగలరు అని తెలిపినారు.

నందిగామలో నాగుల చవితి వేడుకలు వైభవంగా జరిగింది – సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తుల ఉత్సాహం ఉరకలెత్తింది!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నాగుల చవితి పర్వదినం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్య రియల్ ఎస్టేట్ కాలనీలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగ ప్రతిమలకు ఆవుపాలు, కుంకుమ, పసుపుతో అభిషేకాలు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, ఆలయ పరిసరాలు భక్తి గీతాలతో మార్మోగాయి. పూజారి శ్రీ లక్ష్మణాచార్యులు భక్తుల గోత్రనామాలతో అభిషేకాలు జరిపి స్వామి అనుగ్రహం కోసం పూజలు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలి వచ్చి సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేసుకున్నారు. నాగుల చవితి సందర్భంగా భక్తులు స్వామివారిని వేడుకొని తమ మనోకాంక్షలు నెరవేరాలని ప్రార్థించారు.అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు ఇచ్చి భక్తులకు స్వామి వారి అనుగ్రహ దీవెనలు అందించారు. ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు భక్తులకు తెలియజేసినది ఏమనగా ది.26.11.2025న బుధవారం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం జరుగుతుంది. కావున భక్తులు తమ శక్తి కొలది స్వామివారికి ఆర్ధిక మరియు వస్తువులు ధాన్య రూపేన సహకరించగలరు. సంప్రదించవలసిన నెంబర్ 9866308251 భక్తులు వచ్చి తీర్ధ ప్రసాదాలు అన్నప్రసాదము స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందగలరు అని తెలిపినారు.

