నందిగామ పట్టణంలో కాకతీయ –అపోలో విద్యాసంస్థలు 40 సంవత్సరాల సుదీర్ఘ విద్యా చరిత్రను సృష్టించాయని సంస్థల వ్యవస్థాపకులు కాపా రవీంద్రబాబు అన్నారు. గురువారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనేక మంది విద్యార్థులను ఉత్తమ భవిష్యత్తుకు తీర్చిదిద్దిన ఘనత కాకతీయ విద్యాసంస్థలకే దక్కిందన్నారు. భారతదేశంతో పాటు అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ నలుమూలల దేశాల్లో తమ విద్యార్థులు స్థిరపడ్డారని తెలిపారు. కాకతీయ విద్యాసంస్థల అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు 2019లో సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
కాకతీయ–అపోలో సంస్థల అభివృద్ధికి తమ కుటుంబం నిరంతరం కృషి చేసిందని, ఇక్కడ చదివే విద్యార్థులలో ఎక్కువ మంది రైతుకుటుంబాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. కాకతీయ–అపోలో విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ఎక్కడ ఉన్నా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉందన్నారు. భవిష్యత్తులో పాఠశాల తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించను న్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కాపా భారతి, డైరెక్టర్లు కాపా కార్తీక్, కాపా స్ఫూర్తి, రవీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నందిగామలో 40 ఏళ్ల చరిత్రను సృష్టించిన కాకతీయ–అపోలో విద్యాసంస్థలు: కాపా రవీంద్రబాబు
నందిగామ పట్టణంలో కాకతీయ –అపోలో విద్యాసంస్థలు 40 సంవత్సరాల సుదీర్ఘ విద్యా చరిత్రను సృష్టించాయని సంస్థల వ్యవస్థాపకులు కాపా రవీంద్రబాబు అన్నారు. గురువారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనేక మంది విద్యార్థులను ఉత్తమ భవిష్యత్తుకు తీర్చిదిద్దిన ఘనత కాకతీయ విద్యాసంస్థలకే దక్కిందన్నారు. భారతదేశంతో పాటు అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ నలుమూలల దేశాల్లో తమ విద్యార్థులు స్థిరపడ్డారని తెలిపారు. కాకతీయ విద్యాసంస్థల అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు 2019లో సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కాకతీయ–అపోలో సంస్థల అభివృద్ధికి తమ కుటుంబం నిరంతరం కృషి చేసిందని, ఇక్కడ చదివే విద్యార్థులలో ఎక్కువ మంది రైతుకుటుంబాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. కాకతీయ–అపోలో విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ఎక్కడ ఉన్నా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉందన్నారు. భవిష్యత్తులో పాఠశాల తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించను న్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కాపా భారతి, డైరెక్టర్లు కాపా కార్తీక్, కాపా స్ఫూర్తి, రవీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

