కడప జిల్లా నందలూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగల్ విండో) త్రీమెన్ కమిటీ డైరెక్టర్‌గా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆండ్ర శివారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సమక్షంలో ఆయన అధికారికంగా సంతకాలు చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు హాజరయ్యారు.
రైతులకు సేవ చేసే అవకాశం:
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాచూరి మురళి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ ఫలాలను ప్రతి రైతుకు చేరవేయడంలో ఆండ్ర శివారెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శివారెడ్డి నాయకత్వంలో నందలూరు మండలం వ్యవసాయ పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
అంకితభావంతో ముందుకు: వీరబల్లి జయకుమార్ రెడ్డి
బీజేపీ నేత వీరబల్లి జయకుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న శివారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించడం సంతోషకరమన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, విత్తనాలు, ఎరువులు మరియు సకాలంలో రుణాలు అందేలా త్రీ మెన్ కమిటీ ప్రత్యేక చొరవ చూపుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆండ్ర శివారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.


