Thursday, 5 February 2026
  • Home  
  • ధాన్యం కొనుగోలు ప్రారంభం
- జనగాం

ధాన్యం కొనుగోలు ప్రారంభం

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం* *తేదీ: 20.10.2025* *కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, మహిళా పక్షపాతి ప్రభుత్వం…..* *రైతులు దళారుల వద్ద నష్టపోవద్దనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు…..* *ధాన్యం కొనుగోలుకు 23వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం….* *ఈ సీజన్ నుండి మద్దతు ధరతో పాటే బోనస్ కూడా రైతుల ఖాతాలలో జమ….* *రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలి…..* *దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూలూకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి గారు తెలిపారు.* చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను లావణ్య శిరీష్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త్రాగు నీరు, విద్యుత్ లైట్లతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని నిర్వహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించాలి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఎవరైనా డబ్బులు అడిగితె తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల వద్దకు వెళ్లి నష్ట పోవద్దని సూచించారు. మొదటి గ్రేడ్ రకం ధాన్యానికి 2389రూపాయలు, రెండవ గ్రేడ్ ధాన్యానికి 2369 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ఈ సీజన్లో రైతులకు మద్దతు ధరతో పాటే బోనస్ డబ్బులు కూడా రైతుల ఖాతాలలో వారం రోజుల లోపలనే జమ కానున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొవాలని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్మాలని కోరారు. రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 25 లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేయడం, 9రోజుల్లో 9వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఒక చరిత్ర అని కొనియాడారు. సన్నాలకు 500రూపాయల బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ప్రభుత్వం నిలబడుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు 23వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుందని, సీజన్ కు 4నుండి 5వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ కూడా రైతులకు పక్షాన ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డమీది సురేష్ గారు, మాజీ ఎంపీపీ సరిత బాలరాజు గారు,ఘనపూర్ మండల అధ్యక్షులు శీరిష్ రెడ్డి గారు,మండల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఊరడి రాజు గారు, లింగంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఏదునూరి రవీందర్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు కంకటి నరేందర్ గారు, మండల్ బీసీ సెల్ అధ్యక్షులు కండ్లకోలు బాలరాజు గారు, PACS చేర్మెన్, PACS డైరెక్టర్లు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం*

*తేదీ: 20.10.2025*

*కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, మహిళా పక్షపాతి ప్రభుత్వం…..*

*రైతులు దళారుల వద్ద నష్టపోవద్దనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు…..*

*ధాన్యం కొనుగోలుకు 23వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం….*

*ఈ సీజన్ నుండి మద్దతు ధరతో పాటే బోనస్ కూడా రైతుల ఖాతాలలో జమ….*

*రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలి…..*

*దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూలూకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి గారు తెలిపారు.*

చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను లావణ్య శిరీష్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త్రాగు నీరు, విద్యుత్ లైట్లతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని నిర్వహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించాలి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఎవరైనా డబ్బులు అడిగితె తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.

రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల వద్దకు వెళ్లి నష్ట పోవద్దని సూచించారు. మొదటి గ్రేడ్ రకం ధాన్యానికి 2389రూపాయలు, రెండవ గ్రేడ్ ధాన్యానికి 2369 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ఈ సీజన్లో రైతులకు మద్దతు ధరతో పాటే బోనస్ డబ్బులు కూడా రైతుల ఖాతాలలో వారం రోజుల లోపలనే జమ కానున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొవాలని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్మాలని కోరారు.

రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 25 లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేయడం, 9రోజుల్లో 9వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఒక చరిత్ర అని కొనియాడారు. సన్నాలకు 500రూపాయల బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ప్రభుత్వం నిలబడుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు 23వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుందని, సీజన్ కు 4నుండి 5వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ కూడా రైతులకు పక్షాన ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డమీది సురేష్ గారు, మాజీ ఎంపీపీ సరిత బాలరాజు గారు,ఘనపూర్ మండల అధ్యక్షులు శీరిష్ రెడ్డి గారు,మండల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఊరడి రాజు గారు, లింగంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఏదునూరి రవీందర్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు కంకటి నరేందర్ గారు, మండల్ బీసీ సెల్ అధ్యక్షులు కండ్లకోలు బాలరాజు గారు, PACS చేర్మెన్, PACS డైరెక్టర్లు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.