Thursday, 12 February 2026
  • Home  
  • దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేకేసి సంపూర్ణ మద్దతు
- ఖమ్మం

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేకేసి సంపూర్ణ మద్దతు

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు అఖిల భారత అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ (కేకేసి) ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కేకేసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ మాట్లాడుతూ, దేశంలో కార్మికులు ఎన్నో సంవత్సరాల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. లేబర్ కోడ్స్ అమలుతో కార్మికులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, కనీస వేతనాల హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, వ్యక్తి చాకిరి విధానం అమలయ్యే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, అఖిల భారత అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ గారి సలహా సూచనలతో ఈరోజు జరుగుతున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేకేసి జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, జిల్లా నాయకులు విజయవర్మ, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు బి. సతీష్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట్ నాయుడు, వెంకటేశ్వర్లు, కత్తుల సంగయ్య, శ్రీను, భద్రం, పుల్లారావు, విజయ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు అఖిల భారత అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ (కేకేసి) ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా కేకేసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ మాట్లాడుతూ, దేశంలో కార్మికులు ఎన్నో సంవత్సరాల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. లేబర్ కోడ్స్ అమలుతో కార్మికులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, కనీస వేతనాల హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, వ్యక్తి చాకిరి విధానం అమలయ్యే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, అఖిల భారత అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ గారి సలహా సూచనలతో ఈరోజు జరుగుతున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేకేసి జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, జిల్లా నాయకులు విజయవర్మ, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు బి. సతీష్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట్ నాయుడు, వెంకటేశ్వర్లు, కత్తుల సంగయ్య, శ్రీను, భద్రం, పుల్లారావు, విజయ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.