
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. ప్రజలపై ఉన్న GST పన్నుల భారాన్ని తగ్గించబోతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ఉపశమనం ఇవ్వనుంది.
ప్రస్తుతం ఉన్న GST స్లాబ్స్
ప్రస్తుతం GSTలో 5 స్లాబ్స్ ఉన్నాయి:
0%
5%
12%
18%
28%
కొత్త నిర్ణయం – రెండు స్లాబ్స్ మాత్రమే
కేంద్ర ప్రభుత్వం ఈ 5 స్లాబ్స్‌ను కుదించి కేవలం 2 స్లాబ్స్ (5% మరియు 18%) గా మార్చే ప్రణాళికలో ఉంది.
ఏ వస్తువులు ఏ స్లాబ్‌లోకి?
28% నుండి 18%కి
👉 TVలు, ACలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు
12% నుండి 5%కి
👉 వ్యక్తిగత వినియోగ వస్తువులు
18% నుండి 5% లేదా జీరో స్లాబ్‌కి మారే అవకాశం
👉 ఇన్సూరెన్స్
0% లేదా 5% స్లాబ్‌లోనే కొనసాగేవి
👉 ఆహారం, మెడిసిన్స్, విద్య, నిత్యావసర వస్తువులు
ఎప్పుడు అమలవుతుంది?
GST కౌన్సిల్ సెప్టెంబర్/అక్టోబర్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత కొత్త స్లాబ్స్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి.
➡️ దీని వల్ల మధ్య తరగతి ప్రజల ఖర్చులు తగ్గి, వినియోగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

