Wednesday, 18 March 2026
  • Home  
  • దివ్యాంగులకు శుభవార్త
- తూర్పు గోదావరి

దివ్యాంగులకు శుభవార్త

✍️✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు గౌ.కందుల దుర్గేష్ గారి కార్యాలయం నిడదవోలు మార్చి 2026 నుండి SADAREM స్లాట్స్ విడుదల ప్రారంభం పాత పెండింగ్ అప్లికేషన్లకు మార్గం సుగమం. మార్చి 2026 నుంచి మే 2026 వరకు (1st రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్ణీత సంఖ్యలో స్లాట్ లు అందుబాటులో ఉంటాయి ముఖ్య అంశాలు:- ప్రతి సోమ, మంగళవారాల్లో స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. RPWD చట్టం ప్రకారం అసెస్మెంట్ జరుగుతుంది. (RPWD చట్టం అంటే “Rights of Persons with Disabilities Act, 2016” (వికలాంగుల హక్కుల చట్టం, 2016). ఇందులో మొత్తం 21 రకాల వైకల్యాలు గుర్తించబడ్డాయి. అంధత్వం, తక్కువ చూపు, వినికిడి లోపం, లోకోమోటర్ డిజబిలిటీ, కుష్ఠ వ్యాధి నివారణ పొందిన వారు, మేధో వైకల్యం, మానసిక అనారోగ్యం, ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, కండరాల క్షీణత, దీర్ఘకాలిక నరాల వ్యాధులు, లెర్నింగ్ డిజబిలిటీస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మాట మరియు భాషా వైకల్యం, ధలసీమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజ్, మల్టిపుల్ డిజబిలిటీస్, యాసిడ్ ఎటాక్ బాధితులు, పార్కిన్సన్స్ వ్యాధి వంటి పరిస్థితులు ఇందులో చేర్చబడ్డాయి. ముఖ్య సమాచారం:- UDID (Unique Disability ID) కార్డు లింక్ చేయడం అనేది అతి ముఖ్యమైన అంశం. UDID కార్డు అనేది వికలాంగుల కోసం ప్రభుత్వం ఇచ్చే ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డు. UDID కార్డు లింక్ చేయడం అంటే మీ ఆధార్, బ్యాంక్, మరియు ప్రభుత్వ పథకాలతో మీ డిసబిలిటీ ఐడీని కనెక్ట్ చేయడం. దీని వలన పెన్షన్, స్కాలర్‌షిప్, మరియు ఇతర బెనిఫిట్స్ సులభంగా పొందేందుకు ఉపయోగపడుతుంది. గ్రామ సచివాలయం లేదా MeeSevaలో కూడా లింక్ చేయించుకోవచ్చు. ఈ లింకింగ్ వికలాంగతకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే కార్డులో ఉంటాయి. మళ్లీ మళ్లీ సర్టిఫికేట్లు చూపాల్సిన అవసరం తగ్గుతుంది. UDID కార్డు All India valid – ఏ రాష్ట్రంలోనైనా ఉపయోగించవచ్చు. బయోమెట్రిక్ & ఫోటో తప్పనిసరి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరి మెడికల్ బోర్డు ద్వారా ఫైనల్ వెరిఫికేషన్* జరుగుతుంది. పై సమాచారాన్ని *కేడర్ క్షేత్రస్థాయిలో అవసరమైన దివ్యాంగులకు తెలియజేయండి. పూర్తి సమాచారం కొరకు సచివాలయాలలో ఉన్న వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించండి. END…..

✍️✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు గౌ.కందుల దుర్గేష్ గారి కార్యాలయం నిడదవోలు

మార్చి 2026 నుండి SADAREM స్లాట్స్ విడుదల ప్రారంభం

పాత పెండింగ్ అప్లికేషన్లకు మార్గం సుగమం.

మార్చి 2026 నుంచి మే 2026 వరకు (1st రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్ణీత సంఖ్యలో స్లాట్ లు అందుబాటులో ఉంటాయి

ముఖ్య అంశాలు:-

ప్రతి సోమ, మంగళవారాల్లో స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది.

మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు.

RPWD చట్టం ప్రకారం అసెస్మెంట్ జరుగుతుంది. (RPWD చట్టం అంటే “Rights of Persons with Disabilities Act, 2016” (వికలాంగుల హక్కుల చట్టం, 2016).
ఇందులో మొత్తం 21 రకాల వైకల్యాలు గుర్తించబడ్డాయి.

అంధత్వం, తక్కువ చూపు, వినికిడి లోపం, లోకోమోటర్ డిజబిలిటీ, కుష్ఠ వ్యాధి నివారణ పొందిన వారు, మేధో వైకల్యం, మానసిక అనారోగ్యం, ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, కండరాల క్షీణత, దీర్ఘకాలిక నరాల వ్యాధులు, లెర్నింగ్ డిజబిలిటీస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మాట మరియు భాషా వైకల్యం, ధలసీమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజ్, మల్టిపుల్ డిజబిలిటీస్, యాసిడ్ ఎటాక్ బాధితులు, పార్కిన్సన్స్ వ్యాధి వంటి పరిస్థితులు ఇందులో చేర్చబడ్డాయి.

ముఖ్య సమాచారం:-
UDID (Unique Disability ID) కార్డు లింక్ చేయడం అనేది అతి ముఖ్యమైన అంశం.

UDID కార్డు అనేది వికలాంగుల కోసం ప్రభుత్వం ఇచ్చే ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డు.

UDID కార్డు లింక్ చేయడం అంటే మీ ఆధార్, బ్యాంక్, మరియు ప్రభుత్వ పథకాలతో మీ డిసబిలిటీ ఐడీని కనెక్ట్ చేయడం.

దీని వలన పెన్షన్, స్కాలర్‌షిప్, మరియు ఇతర బెనిఫిట్స్ సులభంగా పొందేందుకు ఉపయోగపడుతుంది. గ్రామ సచివాలయం లేదా MeeSevaలో కూడా లింక్ చేయించుకోవచ్చు.

ఈ లింకింగ్ వికలాంగతకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే కార్డులో ఉంటాయి. మళ్లీ మళ్లీ సర్టిఫికేట్లు చూపాల్సిన అవసరం తగ్గుతుంది.

UDID కార్డు All India valid – ఏ రాష్ట్రంలోనైనా ఉపయోగించవచ్చు.

బయోమెట్రిక్ & ఫోటో తప్పనిసరి

ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరి

మెడికల్ బోర్డు ద్వారా ఫైనల్ వెరిఫికేషన్* జరుగుతుంది.

పై సమాచారాన్ని *కేడర్ క్షేత్రస్థాయిలో అవసరమైన దివ్యాంగులకు తెలియజేయండి.
పూర్తి సమాచారం కొరకు సచివాలయాలలో ఉన్న వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించండి.

END…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.