పున్నమి నవంబర్ 02 ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: మన్సూరాబాద్ డివిజన్, హయత్నగర్ పరిధిలోని బొమ్మలగూడి నుండి డబుల్ బెడ్ రూం, కుంట్లూరు, తట్టిఅన్నారం, నాగోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి అనేక సంవత్సరాల క్రితం నిర్మించబడింది. కాలక్రమేణా ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెంది, దాదాపు 30 నుండి 40 కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. అయితే బొమ్మల గుడి వద్ద నుండి డబల్ బెడ్ రూమ్ వరకు పాత రోడ్డు ప్రస్తుతం గుంతలమయంతో, రోడ్డంతా పాడవడంతో ఈ కాలనీల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను గుర్తించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్ ఆయనను కలసి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈ.ఈ రమేష్ బాబు, డి ఈ కనకయ్య, డబ్ల్యు ఐ సీతారాం పర్యటించారు.
ఈ పర్యటనలో కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, అధికారులు కలిసి పాదయాత్రగా రహదారి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మలగూడి నుండి నాగోల్ వరకు ఉన్న రహదారి పునర్నిర్మాణానికి దాదాపు రూ. 4 కోట్ల నిధులు, ఈ రోడ్డు పూర్తి అయిన తర్వాత సుమారు 40 కాలనీల ప్రజలు సులభంగా ప్రజా రవాణా సదుపాయాన్ని పొందగలరు. రాబోయే రోజుల్లో ఈ రహదారి విస్తరణ, సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయి అని తెలిపారు.

దాదాపు 40 కాలనీల ప్రజా రవాణా సౌకర్యం కోసం రూ. 4 కోట్ల నిధుల ప్రతిపాదన డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి
పున్నమి నవంబర్ 02 ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: మన్సూరాబాద్ డివిజన్, హయత్నగర్ పరిధిలోని బొమ్మలగూడి నుండి డబుల్ బెడ్ రూం, కుంట్లూరు, తట్టిఅన్నారం, నాగోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి అనేక సంవత్సరాల క్రితం నిర్మించబడింది. కాలక్రమేణా ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెంది, దాదాపు 30 నుండి 40 కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. అయితే బొమ్మల గుడి వద్ద నుండి డబల్ బెడ్ రూమ్ వరకు పాత రోడ్డు ప్రస్తుతం గుంతలమయంతో, రోడ్డంతా పాడవడంతో ఈ కాలనీల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్ ఆయనను కలసి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈ.ఈ రమేష్ బాబు, డి ఈ కనకయ్య, డబ్ల్యు ఐ సీతారాం పర్యటించారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, అధికారులు కలిసి పాదయాత్రగా రహదారి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మలగూడి నుండి నాగోల్ వరకు ఉన్న రహదారి పునర్నిర్మాణానికి దాదాపు రూ. 4 కోట్ల నిధులు, ఈ రోడ్డు పూర్తి అయిన తర్వాత సుమారు 40 కాలనీల ప్రజలు సులభంగా ప్రజా రవాణా సదుపాయాన్ని పొందగలరు. రాబోయే రోజుల్లో ఈ రహదారి విస్తరణ, సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయి అని తెలిపారు.

