పున్నమి ప్రతినిధి
10 ఫిబ్రవరి 2026
దత్తాత్రేయ కాలనీ, సాయి కాలనీలకు భూగర్భ డ్రైనేజ్ సదుపాయం – అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీ మరియు సాయి కాలనీలలో ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దత్తాత్రేయ కాలనీలో 30.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, సాయి కాలనీలో 19.00 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టడం జరిగింది.
ఈ పనులు పూర్తయిన తర్వాత మురుగు నీరు నిల్వ ఉండటం, రోడ్లపైకి రావడం, దుర్వాసన మరియు దోమల సమస్యలు పూర్తిగా తగ్గి కాలనీల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొననుంది. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…
“ప్రజల ఆరోగ్యం, సౌకర్యాలే మా ప్రాధాన్యం. డ్రైనేజ్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే ప్రతి కాలనీకి సమానంగా నిధులు కేటాయిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గత ఐదు సంవత్సరాలుగా ప్రజల విశ్వాసంతో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. భవిష్యత్తులో కూడా ఇదే వేగంతో పనులు కొనసాగిస్తాం” అని తెలిపారు.
కాలనీ వాసులు మాట్లాడుతూ…
“మా సమస్యను గుర్తించి వెంటనే పరిష్కారం చూపిన కార్పొరేటర్ కి మా కృతజ్ఞతలు. దత్తాత్రేయ కాలనీ, సాయి కాలనీల్లో డ్రైనేజ్ సదుపాయం రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేస్తున్న అభివృద్ధి పనులకు మేమంతా ఎల్లప్పుడూ అండగా ఉంటాం” అని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో అయ్యా కాలనిలా సంక్షేమ సంఘం సభ్యులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, బీజేపీ నాయకులు బొడ్డుపల్లి జనార్దన్,ఇట్టబోయిన నర్సింహా,శేఖర్ రెడ్డి, శ్రీకాంత్, బాలు, అరుణ్, ప్రేమ్, అఖిల్,భరత్,మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు..



