Thursday, 12 February 2026
  • Home  
  • తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శర్వాణి విద్యార్థినులకు సత్కారాలు
- ఆంధ్రప్రదేశ్

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శర్వాణి విద్యార్థినులకు సత్కారాలు

నరసన్నపేట స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఆగస్టు 31న రచయితల వేదిక ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి గారి చేతుల మీదుగా తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రచయితల వేదిక అధ్యక్షులు సదాశివుని కృష్ణ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శర్వాణి విద్యాలయానికి చెందిన విద్యార్థినులు లక్ష్మీ, తనుశ్రీ, జాహ్నవి, సాక్షిని వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచి, ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి గారి చేతుల మీదుగా సత్కరింపబడ్డారు. అలాగే శర్వాణి విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, రచయితల వేదికలో సభ్యునిగా ఉన్న శ్రీ గిరీష్ గారును కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానించారు. తెలుగు భాష గౌరవాన్ని కాపాడుతూ, విద్యార్థుల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిదాయక వేదికగా నిలిచింది.

నరసన్నపేట స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఆగస్టు 31న రచయితల వేదిక ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి గారి చేతుల మీదుగా తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి రచయితల వేదిక అధ్యక్షులు సదాశివుని కృష్ణ గారు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా శర్వాణి విద్యాలయానికి చెందిన విద్యార్థినులు లక్ష్మీ, తనుశ్రీ, జాహ్నవి, సాక్షిని వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచి, ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి గారి చేతుల మీదుగా సత్కరింపబడ్డారు.

అలాగే శర్వాణి విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, రచయితల వేదికలో సభ్యునిగా ఉన్న శ్రీ గిరీష్ గారును కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానించారు.

తెలుగు భాష గౌరవాన్ని కాపాడుతూ, విద్యార్థుల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిదాయక వేదికగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.