*తెలంగాణ వీరనారి ఐలమ్మ పాట ఆడియో ఆవిష్కరణ*
*హాజరైన వివిధ రజక సంఘాల రాష్ట్ర నాయకులు*
★ రచన & గానం చేరాల ప్రకాష్
★ KBN స్టూడియోలో ఆడియో ఆవిష్కరణ
★ చేరాల ప్రకాష్ ఆహ్వానం మేరకు హాజరైన TRRS రాష్ట్ర నాయకులు
హైదరాబాద్, 11ఆగస్టు 2026: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ప్రతిబింబించేలా భూదాన్ పోచంపల్లి వాస్తవ్యులు, సీనియర్ పాత్రికేయులు, రచయిత, గాయకులు చేరాల ప్రకాష్ రచించి, ఆలపించిన “తెలంగాణ వీరనారి ఐలమ్మ” పాట ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ ఉప్పల్ బాగాయత్‌లోని KBN స్టూడియోలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ మెంబర్ చిట్యాల శ్వేత సంపత్ హాజరయ్యారు.
డాక్టర్ కలశ్రీ బిక్షు నాయక్ (KBN స్టూడియో ) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాట ఆడియోను ఆవిష్కరించి, SPL మ్యూజిక్ ఛానల్ ద్వారా విడుదల చేసి వినిపించారు.
పాటను ఆలకించిన నాయకులు రచయిత చేరాల ప్రకాష్‌ను అభినందించారు. తెలంగాణ వీరనారి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, రజక సమాజ చరిత్రను ప్రతిబింబించేలా పాటను రచించి, స్వయంగా ఆలపించడం అభినందనీయమని పేర్కొన్నారు.
తెలంగాణ సామాజిక ఉద్యమాల చరిత్రను, మహనీయుల పోరాటాలను ప్రజలకు చేరువ చేయడంలో పాటలు, కళారూపాలు కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చైతన్యవంతమైన పాటలు రచించి తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యపరచాలని చేరాల ప్రకాష్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ రజక సంఘాల రాష్ట్ర నాయకులతో పాటు మహిళలు, పాత్రికేయులు, కళాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


