నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
శాలిగౌరారం మండలంలోని కొత్త పట్టాదారు రైతులకు జూన్ 5,2025 వరకు పట్టాపాస్ బుక్ వచ్చిన వారికీ మరియు ఇంతవరకు రైతు భీమా చేసుకోని రైతులు మాత్రమే రైతు భీమా చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కీర్తి గారు తెలిపారు.
14 ఆగస్ట్ 1966 నుండి –14ఆగస్ట్2007 మధ్యలో
పుట్టిన రైతులు మాత్రమే రైతు భీమాకి అర్హులు.
ఆధార్ కార్డులో 18 సంవత్సరం నుండి 59 సం. వయస్సు ఉన్న రైతులు మాత్రమే భీమా చేసుకోవాలి.
రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు : —
1.దరఖాస్తు ఫారం (పూర్తి వివరాలతో స్పష్టంగా నింపాలి.)
2.రైతు పట్టాదారు పాస్ బుక్,
3.రైతు ఆధార్ కార్డు జీరాక్స్,
4. నామిని ఆధార్ కార్డు.
రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది— 13 ఆగస్ట్ 2025.

