Tuesday, 24 March 2026
  • Home  
  • “తెనాలి మధుర స్మృతులు… ఎన్నటికీ మరువలేనివి” — మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- గుంటూరు

“తెనాలి మధుర స్మృతులు… ఎన్నటికీ మరువలేనివి” — మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తెనాలి, గుంటూరు జిల్లా — నవంబర్ (పున్నమి ప్రతినిధి) తెనాలి పట్టణంతో తనకు ఉన్న అనుబంధం జీవితాంతం మరువలేనిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఐదు దశాబ్దాలుగా తెనాలిలో జరిగిన పలు సమావేశాలు, ఇక్కడి ప్రజలతో ఉన్న ఆప్యాయత తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగించిందని అన్నారు. పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన ఆయన, మాజీ మంత్రి ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావును మర్యాదపూర్వకంగా కలిశారు. 1980 నుంచి తెనాలిలో జర్నలిస్టుగా, తెలుగు పండిట్‌గా పనిచేసిన కాలాన్ని నిమ్మరాజు గుర్తుచేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు వెంకయ్య నాయుడిని కలుసుకున్నారు.

తెనాలి, గుంటూరు జిల్లా — నవంబర్ (పున్నమి ప్రతినిధి)

తెనాలి పట్టణంతో తనకు ఉన్న అనుబంధం జీవితాంతం మరువలేనిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఐదు దశాబ్దాలుగా తెనాలిలో జరిగిన పలు సమావేశాలు, ఇక్కడి ప్రజలతో ఉన్న ఆప్యాయత తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగించిందని అన్నారు. పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన ఆయన, మాజీ మంత్రి ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావును మర్యాదపూర్వకంగా కలిశారు. 1980 నుంచి తెనాలిలో జర్నలిస్టుగా, తెలుగు పండిట్‌గా పనిచేసిన కాలాన్ని నిమ్మరాజు గుర్తుచేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు వెంకయ్య నాయుడిని కలుసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.