ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
വരംഗൽ

​తూకాల మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు: లీగల్ మెట్రాలజీ అధికారి కే. మనోహర్ హెచ్చరిక

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
​తూకాల మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు: లీగల్ మెట్రాలజీ అధికారి కే. మనోహర్ హెచ్చరిక

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • ​నర్సంపేట: వ్యాపారంలో తూకాల్లో మోసాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వరంగల్ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి కే.
  • మనోహర్ స్పష్టం చేశారు.
  • ఆదివారం నర్సంపేట పట్టణంలోని చేపలు, చికెన్, మాంసం మరియు పండ్ల దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

​నర్సంపేట: వ్యాపారంలో తూకాల్లో మోసాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వరంగల్ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి కే. మనోహర్ స్పష్టం చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలోని చేపలు, చికెన్, మాంసం మరియు పండ్ల దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
​ఈ తనిఖీల్లో తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో ధృవీకరణ చేయించుకోకుండా, శాఖ ముద్రలు లేకుండా వ్యాపారం చేస్తున్న 15 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వ్యాపారులందరూ తమ తూకపు యంత్రాలను నిర్ణీత గడువులోగా తనిఖీ చేయించి, అధికారిక ముద్రలు వేయించుకోవాలని సూచించారు.
​వినియోగదారులకు సరైన తూకంతోనే సరుకులు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వినియోగదారులు కూడా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తూకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *