വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ
- వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు మేరుగు శివకోటి యాదవ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది.
- ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్లు మద్దిరెడ్డి దామోదర్ రెడ్డి, దాసరి పవన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలారాపు నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- రాబోయే 40 రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు, ఇంటింటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు మేరుగు శివకోటి యాదవ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్లు మద్దిరెడ్డి దామోదర్ రెడ్డి, దాసరి పవన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలారాపు నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాబోయే 40 రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు, ఇంటింటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు. జనసేన అభ్యర్థి “డాక్టర్ గడల శ్రీనివాసరావు” విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ ముఖ్య నేతలు షేక్ హుస్సేన్ (ఆర్గనైజింగ్ సెక్రటరీ), ఎలబోయిన డేవిడ్, గంగుల రంజిత్, రోడ్డ శ్రీకాంత్, బొబ్బ పృథ్వీరాజ్, ఆకారపు లహరి-మిలాన్, చందా స్రవంతి, మంజుల, టేకుల రవి, చింతం అజయ్ రత్న, రాపోలు సురేష్, సంతపురి సందీప్, మాదరపు కృష్ణ, రవి వర్మ, బిక్షపతి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.