* మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 100 శాతం అమలు చేసి తీరుతాం మంత్రి నారాయణ
రాష్ట్రంలో ఒకేరోజులో 90% పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.. నెల్లూరు నగరంలోని 11 డివిజన్లో తుఫాను సైతం లెక్కచేయకుండా ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు ..జోరు వానలో సైతం కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న నారాయణను లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సందర్భంగా పెన్షన్ దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు..*అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు* ప్రతినెల ఒకటో తేదీ రాష్ట్ర పండుగలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు.. ఉదయాన్నే ఆరు గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.. 68 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్ దారులకు పెన్షన్ పెంచడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు.. దాదాపు 34 వేల కోట్ల రూపాయలు పెన్షన్ను అందజేస్తున్నామని .. ఇవ్వని హామీలను కూడా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు..భారతదేశంలో కూడా ఎక్కడ ఇంత మొత్తంలో పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సీఎంకు ఉన్నటువంటి ఆపారమైన అనుభవంతో హామీలు అమలు చేస్తున్నామన్నారు… కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు… అదేవిధంగా మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని. జూన్ 12వ తారీకు నుంచి 67 లక్షల మందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామన్నారు. రైతులకు 20,000 అందించామని .. ఆగస్టు నుండి మహిళలకు కూడా ఉచిత బస్సు అమలు చేశామని మరోసారి గుర్తు చేశారు.. ఇప్పటికే 200 అన్న క్యాంటీన్లో 100 రోజులు పూర్తి చేసామన్నారు.. మరో వంద అన్న క్యాంటీన్లో సిద్ధం చేస్తున్నామని.. అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ వందకు వంద శాతం అమలు చేస్తామని కంఠాపదంగా చెప్పారు.. అనంతరం *నుడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడారు..* మంత్రి నారాయణ గారు క్రమశిక్షణకు మారుపేరని జోరు వానలో సైతం లెక్కచేయకుండా సమయానికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం అందులో మంత్రిగా నెల్లూరు నగర ఎమ్మెల్యే కావడం నియోజవర్గ వాసుల అదృష్టమని పేర్కొన్నారు స్కూల్స్ పార్కుల అభివృద్ధి కాలువల పూడికతీత పనులకు మంత్రి పెద్దపీట వేశారన్నారు కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని.. ఒక విజన్ తో ప్రణాళిక బద్ధంగా నగరాభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్,డివిజన్ అధ్యక్షుడు గొడ్డేటి నాగేంద్ర..ప్రధాన కార్యదర్శి నారాయణ..ఉపాధ్యక్షుడు రాంబాబు, కొక్లస్టర్ ఆవుల శ్రీనివాసులు,227 బూత్ ఇంచార్జ్ ఏకుల నాగార్జున,గోతం బాలకృష్ణ, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


