తిరుపతి 18 ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి
తిరుపతిలో సమస్త్ జాట్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిలోకేశ్వర్ మహాదేవ్ మరియు వీర్ తేజాజీ ఆలయ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తర భారత సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జాట్ సమాజ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను దివాకర్ రెడ్డి అభినందించారు.
తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో భిన్న ప్రాంతాల భక్తులకు సేవలందించడం సతోషదాయకమని తెలిపారు.
దైవ చింతన మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. త్రిలోకేశ్వర్ మహాదేవ్ మరియు వీర్ తేజాజీ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.
ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మరియు హోమంలో పాల్గొన్నారు
కార్యక్రమ అనంతరం సమస్త్ జాట్ సమాజ్ ట్రస్ట్ ప్రతినిధులు డాలర్స్ దివాకర్ రెడ్డి సాంప్రదాయ పద్ధతిలో శాలువాతో సత్కరించి, మెమెంటో బహుకరించారు
ఈ కార్యక్రమంలో జాట్ సమాజ్ ట్రస్టు సభ్యులు,వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




