-చిట్వేల్ మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ
-ఎన్టీఆర్కు నివాళులు… కార్యకర్తల నిబద్ధతకు నేతల ప్రశంసలు
-పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు నాగవరం, నేతివారిపల్లి, పెద్దూర్, జెట్టివారిపల్లి, చిట్వేల్ తదితర గ్రామాల్లో టీడీపీ జెండాలను ఎగురవేశారు.ఈ సందర్భంగా పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు గారికి నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశాల్లో నాయకులు మాట్లాడుతూ, 44 సంవత్సరాలుగా పార్టీని వీడకుండా కట్టుబడి పనిచేస్తున్న కార్యకర్తలు పార్టీకి వెన్నెముకలని కొనియాడారు. వారికి ఎల్లప్పుడూ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాధం నాయుడు, రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి, రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని ప్రసాద్, నియోజకవర్గ సీనియర్ నాయకులు మాచినేని విశ్వేశ్వర్ రావు, నందనవనం అజయ్ బాబు పాల్గొన్నారు.మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు, ఉపాధ్యక్షుడు కొండా వెంకటేష్, జనరల్ సెక్రటరీ మించల అనంతయ్య యాదవ్, సీనియర్ నాయకులు లారీ సుబ్బారాయుడు, బాలు రామాంజనేయులు, క్లస్టర్ ఇంచార్జ్లు వెంకటేష్ రాజు, బుంగటావుల రాజశేఖర్ తదితరులతో పాటు గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




