చిట్వేలు మండలంలోని రాపూర్ రోడ్ నందు తిమ్మాయపాలెం క్రాస్:
శ్రీశ్రీశ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ} స్వామి. ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు, ఆలయానికి తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమానికి కోడూరు మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన శంకరయ్య స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులను ఆశీర్వదించారు. ఆలయ పరిసరాల్లో పిల్లలతో కలిసి భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం నిర్వహించబడింది. భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం వడ్డించగా అందరూ మహానందంగా స్వీకరించారు.
ఈ వేడుకల విజయవంతమైన నిర్వహణలో ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ, నిర్వాహకులు చంద్రశేఖర్, ఆలయ పెద్దలు పద్నాతమ్మ, వెంకటసుబ్బయ్య, పొలంరాజు, చిన్నపరాజు, చంగల్‌రాజు, సుబ్బారెడ్డి, నాగలక్షమ్మ తదితరులు విశేష సహకారం అందించారు.


