తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం
తాడేపల్లి లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), మాజీ ఎమ్మెల్యేలు సంబంగి చిన వెంకటప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగరావు, రాజాం పార్టీ సమన్వయకర్త తాలే రాజేష్ తదితరులు హాజరయ్యారు.

