డా బి ఆర్ అంబేద్కర్ కొనసీమ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
ఈరోజు దసరా పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో ఉన్న (ONGC) ఓ.యన్.జి.సి రేఫినిరీ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ శుభాకాంక్షల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మేక పోతు బలి ఇచ్చి, నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా భజనలు, మంగళవాయిద్యాలు, సంప్రదాయ కార్యక్రమాలు అలరించాయి. పండుగను పురస్కరించుకుని ఉద్యోగుల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన ఏర్పాట్లు చేశారు. పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తూ కార్యాలయం ప్రత్యేకంగా అలంకరించబడింది. ఈ కార్యాచరణలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సంస్థ అభివృద్ధి, దేశ సమృద్ధి కోసం దేవిని ప్రార్థించారు. సంప్రదాయాలను పాటిస్తూ ఈ వేడుకలు జరుపుకోవడం హర్షణీయమని అధికారులు పేర్కొన్నారు. దసరా పండుగతో కార్యాలయం ఆనందభరితంగా మారింది.


