అనంతసాగరం మండలంలో పనిచేస్తున్న తహసిల్దార్ జయవర్ధన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ మహిళ మండల సర్వేయర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు నిజమని నిర్ధారించారు. విచారణ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకుని తహసిల్దార్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీ లేదని జిల్లా యంత్రాంగం తెలిపింది.

తహసిల్దార్ జయవర్ధన్‌పై సస్పెన్షన్ వేటు