Tuesday, 9 December 2025
  • Home  
  • తమ ప్రచారాన్ని ముగించాలి
- కామారెడ్డి

తమ ప్రచారాన్ని ముగించాలి

కామారెడ్డి, 09, పున్నమి ప్రతినిధి : జిల్లా మంగళవారం – 10 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు; మద్యం దుకాణాలు మూసివేత కామారెడ్డి జిల్లాలో ఈనెల 11 వ తేదీన (గురువారం) జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచారంపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే 10 మండలాల పరిధిలో నేటి సాయంత్రం 5:00 గంటల (17:00 hrs) వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల దశలు I, II & III – ఎన్నికల ప్రచార ముగింపు సమయాల ప్రకటన రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల దశలు-I, II మరియు III లకు సంబంధించి ఎన్నికల ప్రచారం ముగిసే తేదీలు, సమయాలు క్రింది విధంగా నిర్ణయించబడినవి: 1. దశ – I ఎన్నికల ప్రచారం 09.12.2025 సాయంత్రం 5.00 గంటలకు ముగియవలసి ఉంటుంది. 2. దశ – II ఎన్నికల ప్రచారం 12.12.2025 సాయంత్రం 5.00 గంటలకు ముగియవలసి ఉంటుంది. 3. దశ – III ఎన్నికల ప్రచారం 15.12.2025 సాయంత్రం 5.00 గంటలకు ముగియవలసి ఉంటుంది. పోలింగ్ తేదీలకు 48 గంటల ముందు అమల్లోకి వచ్చే ‘నిశ్శబ్ద కాలం (Silence Period)’ నిబంధనల ప్రకారం, పై తేదీల తర్వాత ఎటువంటి విధమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు. ఉల్లంఘన జరిగిన పక్షంలో ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోబడును. ​నిషేధాజ్ఞల అమలు: ఎన్నికల సజావుగా నిర్వహణ కోసం ఇప్పటికే 10 మండలాల్లో నిషేధాజ్ఞలు ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి (Sec 163 BNSS) అమలులోకి వస్తాయి. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం. ​మద్యం దుకాణాలు బంద్: ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ​పోలింగ్ వివరాలు: పోలింగ్ డిసెంబర్ 11వ తేదీ, గురువారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడుతుంది ​ఓట్ల లెక్కింపు: పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు (డిసెంబర్ 11న) సాయంత్రం ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి జరుగుతుంది. తేది:09.12.2025 కామారెడ్డి జిల్లా మంగళవారం పకడ్బందీగా మొదటి విడత ఎన్నికలకు సంబందించిన ఏర్పాట్లు పూర్తి చేయాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 సందర్భంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఎన్నికల సంఘం కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, సాధారణ, వ్యయ పరిశీలకులు, జిల్లా పంచాయతీ అధికారులతో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు తీసుకోవలసిన చర్యలు, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఓటర్ల ప్రభావిత అంశాలను అరికట్టడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడతలో రాష్ట్రంలోని 3 వేల 834 గ్రామపంచాయతీ సర్పంచ్, 27 వేల 628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఇందు కొరకు 37 వేల 562 పోలింగ్ కేంద్రాలలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. సర్పంచ్ స్థానానికి 12 వేల 960 మంది, వార్డు సభ్యుల స్థానానికి 65 వేల 455 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ సమయాలలో జాగ్రత్తలు వహించాలని, ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ , జిల్లా ఎస్పీ , సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలు నిర్వహించే అధికారులకు పోలింగ్, ఇతర పోలింగ్ అధికారులకు శిక్షణ అందించి పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ అందించడం జరుగుతుందని, ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ఆయా మండల కేంద్రాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో కౌంటర్లు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు, పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేలా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి, 09, పున్నమి ప్రతినిధి :
జిల్లా మంగళవారం

– 10 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు; మద్యం దుకాణాలు మూసివేత

కామారెడ్డి జిల్లాలో ఈనెల 11 వ తేదీన (గురువారం) జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచారంపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే 10 మండలాల పరిధిలో నేటి సాయంత్రం 5:00 గంటల (17:00 hrs) వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల దశలు I, II & III – ఎన్నికల ప్రచార ముగింపు సమయాల ప్రకటన రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల దశలు-I, II మరియు III లకు సంబంధించి ఎన్నికల ప్రచారం ముగిసే తేదీలు, సమయాలు క్రింది విధంగా నిర్ణయించబడినవి:

1. దశ – I
ఎన్నికల ప్రచారం 09.12.2025 సాయంత్రం 5.00 గంటలకు ముగియవలసి ఉంటుంది.
2. దశ – II
ఎన్నికల ప్రచారం 12.12.2025 సాయంత్రం 5.00 గంటలకు ముగియవలసి ఉంటుంది.
3. దశ – III
ఎన్నికల ప్రచారం 15.12.2025 సాయంత్రం 5.00 గంటలకు ముగియవలసి ఉంటుంది.

పోలింగ్ తేదీలకు 48 గంటల ముందు అమల్లోకి వచ్చే ‘నిశ్శబ్ద కాలం (Silence Period)’ నిబంధనల ప్రకారం, పై తేదీల తర్వాత ఎటువంటి విధమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు. ఉల్లంఘన జరిగిన పక్షంలో ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోబడును.

​నిషేధాజ్ఞల అమలు: ఎన్నికల సజావుగా నిర్వహణ కోసం ఇప్పటికే 10 మండలాల్లో నిషేధాజ్ఞలు ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి (Sec 163 BNSS) అమలులోకి వస్తాయి. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం.

​మద్యం దుకాణాలు బంద్: ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

​పోలింగ్ వివరాలు: పోలింగ్ డిసెంబర్ 11వ తేదీ, గురువారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడుతుంది

​ఓట్ల లెక్కింపు: పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు (డిసెంబర్ 11న) సాయంత్రం ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి జరుగుతుంది.

తేది:09.12.2025
కామారెడ్డి జిల్లా మంగళవారం

పకడ్బందీగా మొదటి విడత ఎన్నికలకు సంబందించిన ఏర్పాట్లు పూర్తి చేయాలి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 సందర్భంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఎన్నికల సంఘం కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, సాధారణ, వ్యయ పరిశీలకులు, జిల్లా పంచాయతీ అధికారులతో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు తీసుకోవలసిన చర్యలు, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఓటర్ల ప్రభావిత అంశాలను అరికట్టడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడతలో రాష్ట్రంలోని 3 వేల 834 గ్రామపంచాయతీ సర్పంచ్, 27 వేల 628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఇందు కొరకు 37 వేల 562 పోలింగ్ కేంద్రాలలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. సర్పంచ్ స్థానానికి 12 వేల 960 మంది, వార్డు సభ్యుల స్థానానికి 65 వేల 455 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ సమయాలలో జాగ్రత్తలు వహించాలని, ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ , జిల్లా ఎస్పీ , సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
ఎన్నికలు నిర్వహించే అధికారులకు పోలింగ్, ఇతర పోలింగ్ అధికారులకు శిక్షణ అందించి పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ అందించడం జరుగుతుందని, ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ఆయా మండల కేంద్రాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో కౌంటర్లు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు, పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేలా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.