అధికారులకు పల్లా ఆదేశం
విశాఖపట్నం, మార్చి 1, పున్నమి ప్రతినిధి.
అండమాన్ కొండయ్యవలస కొలనీ వాసుల ఆరాధ్య దేవత బంగారమ్మ ఆలయ ప్రాంగణం లో ప్రహరీ గోడ నిర్మాణం అడ్డుకుంటున్న వారిపై స్థానిక యం ఎల్ ఏ పల్లా శ్రీనివాస రావు కి గ్రామస్తులు నగరం లో ఉన్న స్వగృహం లో కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన తక్షణమే స్పందించి అక్రమణ దారుడ్ని అడ్డు పెట్టుకుని ప్రహరీగోడ నిర్మాణం ను అడ్డుకునే వారికి హెచ్చరించి, పనిని నిలుపుదల చేసిన అధికారులకు పనిని వెంటనే మొదలు పెట్టి పూర్తి చెయ్యాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా బంగారమ్మ కొలనీ వాసులు వందలాది మంది యం ఎల్ ఏ పల్లా శ్రీనివాస రావు గారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పామల వసంతరావు, మదాసు రామక్రిష్ణ, మదాసు గణేష్, కలిమి సుధాకర్, బలిరెడ్డి అప్పారావు, నారాయణరావు, విందుల పాపారావు, జోగారావు, రాజు, రాజేష్, ఇందల అశోక్, శ్రావణ్ కుమార్, సూర్నపూడి నూకరాజు, ఎస్ నారాయణ, జాజుల లక్ష్మి, మంగమ్మ, జయ, వరలక్ష్మి. ఇందుమతి, నీలవేణి, లుకలాపు తవిటమ్మ, కొవ్వాడ అప్పలనసరమ్మ తదితరులు పాల్గొన్నారు.



