నెల్లూరు మార్చి (పున్నమి ప్రతినిధి)
జస్టిస్ యం ఆర్ ఏ అన్సారీ స్మారక గ్రంధాలయం మూలపేట నెల్లూరు. జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి గారు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ లో భాగంగా గ్రంధాలయంను డోనర్స్ సహాయం అభివృద్ధి చేయాలనీ చూచించారు.అలాగే ప్రభుత్వం ద్వారా చెల్లించే సెస్ బకాయిలను వసూలు చేసి గ్రంధాలయం అభివృద్ధి చేయాలనీ కోరారు.
విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే కాంపిటటివ్ బుక్స్ తెప్పించాలని సూచించారు.
రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయం పనితీరు, అందుబాటులో ఉన్న పుస్తకాలు సౌకర్యాలపై పాఠకులతో ఆరా తీశారు. విద్యార్థులు, యువత ఎక్కువగా గ్రంథాలయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. మూలపేట గ్రంథాలయంకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి గ్రంథాలయంను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంధాలయం సిబ్బంది చంద్రగిరి ఈశ్వరమ్మ మరియు పాఠకులు ఉన్నారు.
Uploaded Video:


