ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన నిరాశ్రయ కుటుంబాలు మరియు వారి చిన్నారుల కోసం ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
డా. గొంగూర వెంకటేశ్వర్లు (జి.వి.) ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 200 మందికి పైగా ప్రజలకు వైద్యులు వైద్య పరీక్ష లు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు, ప్రాథమిక రక్తపరీక్షలు మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు .ముఖ్యంగా పిల్లల ఆరోగ్య పరిస్థితులు, మహిళల ఆరోగ్య సమస్యలు, వృద్ధుల దీర్ఘకాలిక వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా డా. గోంగూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,
“సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ఆరోగ్య సేవలు అందించడం మన సామాజిక బాధ్యత. నివాసం కోల్పోయిన కుటుంబాలకు వైద్య సహాయం మాత్రమే కాకుండా, ఆరోగ్య అవగాహన కూడా అత్యంత అవసరం. ఇలాంటి శిబిరాలను నిరంతరం నిర్వహిస్తాము” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా. షేక్ యేడుకొండలు, డా. కృప, డా. హనుమంత్ రావు, నరేష్, కిరణ్, అరుణ్, శ్రీకాంత్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొని సేవలందించారు.
శిబిరంలో పాల్గొన్న ప్రజలు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసి, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.



