Monday, 8 December 2025
  • Home  
  • డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు ఎందరికో ఆదర్శం ….
- Featured

డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు ఎందరికో ఆదర్శం ….

డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు ఎందరికో ఆదర్శం … సాధారణంగా పేద మద్యతరగతి ప్రజలకు వైద్యసేవలందించడంలో నెల్లూరులో ఉన్న ఎన్నో ఆసుపత్రులలో డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి(పీపీసీ) ఒక విశిష్టత పొంది ఉంది. అయితే కొందరిలో ఈ ఆసుపత్రి పట్ల ఈకార్పొరేటు ఆసుపత్రుల మాయాజాలం చూసినోళ్ళకు వేరే అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఆసుపత్రిలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి కన్నా ఎక్కువ రోగులు ఓపి..ఇన్ పేషెంట్లు గా ఉంటారు. ఒక ఆశయంతో సేవల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా సరైన, సహేతుక వైద్యాన్ని అందించడం లో అతితక్కువ ధరలలో మంచి వైద్యం అందిస్తున్నా….ఈరోజుల్లో కొన్ని మద్యతరగతి వర్గాలకు ఏ ఆసుపత్రిలో చూపించుకున్నావు అనేది ఓ స్టేటస్ సింబల్ గా కూడా ఉంది.అటువంటి అభిప్రాయాలు ఈమద్యకాలంలో ముఖ్యంగా విద్య‌,వైద్యం విషయంలో కార్పొరేటు కల్చర్ కనిపిస్తుంది. ఈ కరోనా కష్టకాలంలో కార్పొరేటు ఆసుపత్రులన్నీ ఎన్నోకారణాలతో మూసేసి జంప్ అయ్యారు. కిటకిటలాడే పొగతోట నెల్లూరు ఆసుపత్రుల హబ్ నిర్మానుష్యంగా అయింది.ఇప్పటిదాకా లేనిజబ్బులకు వైద్యం జరిగిందా అన్న వ్యాఖ్యానాలు జోకులూ వినిపించాయి. అంతలో కొంతో ఎంతో వాస్తవం లేకపోలేదు. అయితే ఈ కరోనా సమయంలో గర్భంతో ఉన్నవారు డెలివరీ డేట్ దగ్గరపడ్డావాళ్ళు వాళ్ళబంధువులూ టెన్షన్…అప్పటిదాకా చూస్తున్న డాక్టర్లు కొందరయితే ఫోన్లూ బంద్ చేశారు. ఏం చేయాలో తోచని పరిస్థితి లో విపరీతంగా ఒత్తిడి. జిల్లా యంత్రాంగం ఎంత చెప్పినా ఆచరణలో షరా మామూలే. సందట్లో సడేమియా అన్నట్లు ఓ డాక్టర్ అయితే ఏకంగా డెలివరీ కి మూడురోజులకు లకారం వసూలు చేసిందట. చాలామంది ఈసమస్యతో అల్లాడారు. అల్లాడుతున్నారు. ఇక్కడే మా పొరుగింట్లో ఓ అమ్మాయీ(భర్త ) ప్రయివేటు ఉద్యోగి…లాక్డౌను లో చెన్నైలో ఇరుక్కుపోయాడు. సలహా అడిగితే మా ఆవిడ నాకు చెప్పింది. వెంటనే పీపీసి పేరుచెప్పా…కొంత ఓరకమైన అభిప్రాయం ఉన్నా మాట్లాడమని చెప్పారు. రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సూపరింటెండెంట్ డా.రాజేశ్వర్ రావుగారితో మాట్లాడాను. వివరాలు అడిగి సరే పంపించండి అన్నారు. వెళ్ళారు తొలుత అన్ని పరీక్షలు చేసి డెలీవరీ డేటుకు ఓ రెండురోజులు ముందు రమ్మన్నారు. డా.రాధా గారు చాలా నెమ్మదిగా గర్భీణికి ధైర్యం ఇచ్చారు. సిజేరియన్ లపేర డబ్బుగుంజే కార్పొరేటు కల్చర్ కు భిన్నంగా వీలైనంతవరకు సాధారణ డెలివరీ అయ్యేందుకు ప్రయత్నించి అవసరం మేరకే కోత..అనే వైద్యప్రమాణాలను గుర్తెరిగి వైద్యం చేసే అతి కొద్ది ఆసుపత్రులలో పీపీసి అని చెప్పవచ్చు. ఆ అమ్మాయి డెలివరి మొన్న సోమవారం డెలివరీ అదీ నార్మల్ డెలివరీ.. ఆహారం కూడా అందించారట. చాలా చక్కగా ఏవిధమైన విసుగు చూపక వైద్యం ఆతిథ్యం ఇచ్చినట్లు చూచుకున్నారని…జీవితంలో మరచిపోలేమని ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులు చెప్పడం…ఇప్పటిదాకా మాకున్న ఓ దురభిప్రాయం..(అనుభవంలేని) ఉండేదని అన్నారు. ఇంతకీ ఆసుపత్రి చేసిన వసూలు కేవలం రూ.ఆరువేల రూపాయలే…ఆశ్చర్యంకదా…లక్షలు గుంజే ఆసుపత్రులెక్కడ… వైద్యోనారాయణోహరి అంటే ఇదేగా…అట్లని కార్పొరేట్ ఆసుపత్రులను నిందించడం కాదు గానీ…వైద్య ప్రమాణాలు మరచి సంపాదనే ధ్యేయంగా ఉన్న కొందరి..కొన్నిఆసుపత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆపద సమయంలో మూసేసుకొని వెళ్ళిపోయిన ఆసుపత్రులకు ప్రజలు ఎంత పెట్టారో…కదా… ఓపీలు బంద్ చేయమనొచ్చు…కానీ ఎంతమంది ఎన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కనీసం తమ రోగీలకు టెలి ఫోన్ ద్వారానైనా ధైర్యం ఇవ్వగలిగారు..ఆలో చించాలి. అప్పుచేయించి మనచే వైద్యమందించే వాడా…లేక ఆపదలో నిఖార్సుగా సహేతుకంగా వైద్యాన్ని అందించేవారా….ప్రజలు ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ రామచంద్రారెడ్డి ఆసుపత్రితో మా ఆత్మకూరు ఆయన మా వీధి వారు మానాన్నకు మంచి స్నేహితుడు డా.చెర్లో రమణారెడ్డి గారిద్వారానే మా కుటుంబానికి ఈ ఆసుపత్రితో అనుబంధం. ఆయన నేను డిగ్రి వీఆర్సిలో చదివేపుడూ ఆర్ధిక సహాయం… ఆతిథ్యం కూడా ఇచ్చాడు. మాకు మాకుటుంబానికి ఈ ఆసుపత్రితో అనుబంధం మంచి అనుభవాలు ఉన్నాయి.తదుపరి ఈ అత్యున్నత ఆశయాలతో ఉన్న ఈ ఆసుపత్రితో కలిసి పూర్వ వృత్తిపరంగా కూడా ఉన్నాను. అందుకు గర్విస్తున్నా…. ఈ కరోనా కష్టకాలంలో అత్యున్నత సేవలందిస్తూన్న డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ వైద్యబృందానికి…సిబ్బందికి అబివందనాలతో…. ఇటువంటి ఆశయాలతో నడిచే నడిపించే వారికి నిజమైన సహకారం అందిద్దాం…. లేట్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి ఆశయాలను తమ అకుంఠిత దీక్షతో అమరుడిని చేసిన ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్…. జివి నాగరాజరావు, బీ.యస్సీ ఎల్లెల్బీ న్యాయవాది, హైకోర్టు ఆంధ్రప్రదేశ్

డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు ఎందరికో ఆదర్శం …

సాధారణంగా పేద మద్యతరగతి ప్రజలకు వైద్యసేవలందించడంలో నెల్లూరులో ఉన్న ఎన్నో ఆసుపత్రులలో
డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి(పీపీసీ) ఒక విశిష్టత పొంది ఉంది. అయితే కొందరిలో ఈ ఆసుపత్రి పట్ల ఈకార్పొరేటు ఆసుపత్రుల మాయాజాలం చూసినోళ్ళకు వేరే అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఆసుపత్రిలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి కన్నా ఎక్కువ రోగులు ఓపి..ఇన్ పేషెంట్లు గా ఉంటారు. ఒక ఆశయంతో సేవల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా సరైన, సహేతుక వైద్యాన్ని అందించడం లో అతితక్కువ ధరలలో మంచి వైద్యం అందిస్తున్నా….ఈరోజుల్లో కొన్ని మద్యతరగతి వర్గాలకు ఏ ఆసుపత్రిలో చూపించుకున్నావు అనేది ఓ స్టేటస్ సింబల్ గా కూడా ఉంది.అటువంటి అభిప్రాయాలు ఈమద్యకాలంలో ముఖ్యంగా విద్య‌,వైద్యం విషయంలో కార్పొరేటు కల్చర్ కనిపిస్తుంది.
ఈ కరోనా కష్టకాలంలో కార్పొరేటు ఆసుపత్రులన్నీ ఎన్నోకారణాలతో మూసేసి జంప్ అయ్యారు. కిటకిటలాడే పొగతోట నెల్లూరు ఆసుపత్రుల హబ్ నిర్మానుష్యంగా అయింది.ఇప్పటిదాకా లేనిజబ్బులకు వైద్యం జరిగిందా అన్న వ్యాఖ్యానాలు జోకులూ వినిపించాయి. అంతలో కొంతో ఎంతో వాస్తవం లేకపోలేదు.
అయితే ఈ కరోనా సమయంలో గర్భంతో ఉన్నవారు డెలివరీ డేట్ దగ్గరపడ్డావాళ్ళు వాళ్ళబంధువులూ టెన్షన్…అప్పటిదాకా చూస్తున్న డాక్టర్లు కొందరయితే ఫోన్లూ బంద్ చేశారు. ఏం చేయాలో తోచని పరిస్థితి లో విపరీతంగా ఒత్తిడి. జిల్లా యంత్రాంగం ఎంత చెప్పినా ఆచరణలో షరా మామూలే. సందట్లో సడేమియా అన్నట్లు ఓ డాక్టర్ అయితే ఏకంగా డెలివరీ కి మూడురోజులకు లకారం వసూలు చేసిందట. చాలామంది ఈసమస్యతో అల్లాడారు. అల్లాడుతున్నారు. ఇక్కడే మా పొరుగింట్లో ఓ అమ్మాయీ(భర్త ) ప్రయివేటు ఉద్యోగి…లాక్డౌను లో చెన్నైలో ఇరుక్కుపోయాడు. సలహా అడిగితే మా ఆవిడ నాకు చెప్పింది. వెంటనే పీపీసి పేరుచెప్పా…కొంత ఓరకమైన అభిప్రాయం ఉన్నా మాట్లాడమని చెప్పారు. రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సూపరింటెండెంట్ డా.రాజేశ్వర్ రావుగారితో మాట్లాడాను. వివరాలు అడిగి సరే పంపించండి అన్నారు. వెళ్ళారు తొలుత అన్ని పరీక్షలు చేసి డెలీవరీ డేటుకు ఓ రెండురోజులు ముందు రమ్మన్నారు. డా.రాధా గారు చాలా నెమ్మదిగా గర్భీణికి ధైర్యం ఇచ్చారు. సిజేరియన్ లపేర డబ్బుగుంజే కార్పొరేటు కల్చర్ కు భిన్నంగా వీలైనంతవరకు సాధారణ డెలివరీ అయ్యేందుకు ప్రయత్నించి అవసరం మేరకే కోత..అనే వైద్యప్రమాణాలను గుర్తెరిగి వైద్యం చేసే అతి కొద్ది ఆసుపత్రులలో పీపీసి అని చెప్పవచ్చు. ఆ అమ్మాయి డెలివరి మొన్న సోమవారం డెలివరీ అదీ నార్మల్ డెలివరీ.. ఆహారం కూడా అందించారట. చాలా చక్కగా ఏవిధమైన విసుగు చూపక వైద్యం ఆతిథ్యం ఇచ్చినట్లు చూచుకున్నారని…జీవితంలో మరచిపోలేమని ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులు చెప్పడం…ఇప్పటిదాకా మాకున్న ఓ దురభిప్రాయం..(అనుభవంలేని) ఉండేదని అన్నారు. ఇంతకీ ఆసుపత్రి చేసిన వసూలు కేవలం రూ.ఆరువేల రూపాయలే…ఆశ్చర్యంకదా…లక్షలు గుంజే ఆసుపత్రులెక్కడ…
వైద్యోనారాయణోహరి అంటే ఇదేగా…అట్లని కార్పొరేట్ ఆసుపత్రులను నిందించడం కాదు గానీ…వైద్య ప్రమాణాలు మరచి సంపాదనే ధ్యేయంగా ఉన్న కొందరి..కొన్నిఆసుపత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ఆపద సమయంలో మూసేసుకొని వెళ్ళిపోయిన ఆసుపత్రులకు ప్రజలు ఎంత పెట్టారో…కదా…

ఓపీలు బంద్ చేయమనొచ్చు…కానీ ఎంతమంది ఎన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కనీసం తమ రోగీలకు టెలి ఫోన్ ద్వారానైనా ధైర్యం ఇవ్వగలిగారు..ఆలో చించాలి.

అప్పుచేయించి మనచే వైద్యమందించే వాడా…లేక ఆపదలో నిఖార్సుగా సహేతుకంగా వైద్యాన్ని అందించేవారా….ప్రజలు ప్రభుత్వాలు ఆలోచించాలి.

ఈ రామచంద్రారెడ్డి ఆసుపత్రితో మా ఆత్మకూరు ఆయన మా వీధి వారు మానాన్నకు మంచి స్నేహితుడు డా.చెర్లో రమణారెడ్డి గారిద్వారానే మా కుటుంబానికి ఈ ఆసుపత్రితో అనుబంధం. ఆయన నేను డిగ్రి వీఆర్సిలో చదివేపుడూ ఆర్ధిక సహాయం… ఆతిథ్యం కూడా ఇచ్చాడు. మాకు మాకుటుంబానికి ఈ ఆసుపత్రితో అనుబంధం మంచి అనుభవాలు ఉన్నాయి.తదుపరి ఈ అత్యున్నత ఆశయాలతో ఉన్న ఈ ఆసుపత్రితో కలిసి పూర్వ వృత్తిపరంగా కూడా ఉన్నాను. అందుకు గర్విస్తున్నా….

ఈ కరోనా కష్టకాలంలో అత్యున్నత సేవలందిస్తూన్న డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ వైద్యబృందానికి…సిబ్బందికి అబివందనాలతో….

ఇటువంటి ఆశయాలతో నడిచే నడిపించే వారికి నిజమైన సహకారం అందిద్దాం….

లేట్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి ఆశయాలను తమ అకుంఠిత దీక్షతో అమరుడిని చేసిన ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్….

జివి నాగరాజరావు,
బీ.యస్సీ ఎల్లెల్బీ
న్యాయవాది, హైకోర్టు
ఆంధ్రప్రదేశ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.