ఆదిలాబాద్ రూరల్ మండలం పోతాగూడ గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న లు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డబ్బు పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, ఖాతాకు కేవైసీ తప్పనిసరి చేసుకోవాలని, నామినీలను పెట్టాలని తెలిపారు. బ్యాంకుల్లో గల ఇన్స్యూరెన్స్, పెన్షన్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ గురించి, స్వయం ఉపాధి లోన్స్ గురించి, శిక్షణ గురించి తెలిపారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపి 1930 టోల్ ఫ్రీ నెంబర్ గురించి వివరించారు. డిపాజిటర్లు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు బ్యాంకును సంప్రదించి నిబంధనల ప్రకారం వచ్చే లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిపిఎం మణికంఠ, గ్రామస్తులు మారుతి, కన్నీరం, శ్రీనివాస్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

డబ్బు పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలి – సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్ కమలాకర్, భూమన్న