*ట్రాన్స్ లేషనల్ మెడిసిన్ పై జాతీయ సదస్సు ప్రారంభం*
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
*ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ట్రాన్స్ లేషనల్ మెడిసిన్ ఇన్ క్యాన్సర్ టి.ఎం.సి- 2025 జాతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఏయూ టి.ఎల్.ఎన్ స భామందిరంలో సదస్సును వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్ పార్క్ సీఈఓ డాక్టర్ ఎం. కులకర్ణి ప్రారంభించారు* . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆలోచన పూర్తిస్థాయిలో వ్యాధులను నయం చేయలేదని అన్నారు. ఒక ఆలోచనను ఔషధంగా తయారు చేయడానికి మధ్యలో అనేక అంశాలు ముడిపడి ఉంటాయని చెప్పారు, ట్రాన్స్ లేషనల్ అంకాలజీ ప్రాముఖ్యతను వివరించారు. యువత, పరిశోధకులు మూడు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిందాలని చెప్పారు. విశాల దృక్పథం కలిగి ఉండడం, సవాళ్లను స్వీకరించే మనస్తత్వం అలవాటు చేసుకోవడం, అర్థమెటిక్ స్కిల్స్ పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహిందాలని చెప్పారు. వైఫల్యాలనుంచి నేర్చుకునే తత్వాన్ని కలిగి ఉండడం ఎంతో ప్రధానమని చెప్పారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
*ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విభిన్న సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకొని సంయుక్తంగా కలిసి పనిచేసే ఆలోచన* ఉందని చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయడం జరుగుతుందని అన్నారు.
ఇంద్రాస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర ఓలేటి మాట్లాడుతూ క్యాన్సర్ ఒక భారంగా పరిణమిస్తోందని చెప్పారు. దీనికి పరిష్కారం చూపడంలో విద్యావేత్తలు, పరిశ్రమలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. క్యాన్సర్ కు అవసరమైన పరిష్కారాన్ని చూపడంలో విభిన్న విభాగాలకు చెందిన వారు సమన్వయంతో పని చేస్తే సత్వర ఫలితాలను పొందవచ్చునని అన్నారు.
*సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. వి. ఆర్ రాజు మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడం ఎంతో అవసరమన్నారు. వినూత్నమైన ఆలోచనలతో పనిచేయాలని సూచించారు.*
*సదస్సు కన్వీనర్ ఆచార్య పి.రాధిక రెండు రోజుల సదస్సు ప్రత్యేకతలను, ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం అతిదులను సత్కరించారు. పరిశోధకులు, ఆచార్యులు సదస్సుకు సంబంధించి అందించిన పరిశోధనా పత్రాలు, పోస్టర్ ప్రజెంటేషన్* తదితర అంశాలకు సంబంధించిన వివరాలను వివరించారు.


