ముస్తాబాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం ద్వారా ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని కస్తూర్బా, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జెడ్పీ హైస్కూల్లలో చదువుతున్న మొత్తం 486 మంది టెన్త్ విద్యార్థులకు ఈ సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్వర్ పాషా, శీలం స్వామి, గూడూరి భరత్, ఎండీ నవాజ్, కోడే శ్రీనివాస్, నల్ల నర్సయ్య, వంగూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.



