శ్రీకాళహస్తి పట్టణంలో టూ టౌన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజుని ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలవాతో ఘనంగా సత్కరించారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపుతున్న కృషిని ప్రశంసిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. పోలీసు శాఖ ప్రజలతో స్నేహపూర్వకంగా పనిచేయడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి జనామాల గురవయ్య, జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు పులి శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షురాలు చారులత, అలాగే పలువురు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐని సత్కరించిన ప్రజా సంఘాల నాయకులు