*టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్ కాంగ్రెస్ లో చేరిక*
పున్నమి న్యూస్ తెలంగాణ
19 జనవరి 2026
పున్నమి న్యూస్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో జెలమోని రవీందర్ తో పాటు మరో 150 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై, పార్టీలో చేరినట్లు ఇబ్రహీంపట్నం మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వందల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, రాష్ట్రంలోని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, సర్వే ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గుర్నాథ్ రెడ్డి, మాజీ జడ్పిటిసి భూపతి గల్ల మహిపాల్, రాష్ట్ర నాయకులు ఈసీ చంద్రశేఖర్ గౌడ్, ముత్యాల రాజశేఖర్, ప్రశాంత్, మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ఆనంద్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జెర్కొని బాలరాజ్, భర్తకు జగన్, నీళ్ల భాను గౌడ్, ఈగల రాములు, ఇందిరాల రమేష్, బర్ల జగదీశ్వర్, ఆముదాల యాదగిరి, మైనార్టీ నాయకులు ఫిరోజ్, గౌస్, మునీర్, అశుభై, మహ్మద్ ఇమ్రాన్, అయ్యాన్ పటేల్,తోపాటు పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు జెలమోని మాధవి, ముఖేష్, జయమ్మ, క్రాంతి, ఎండి జుబేదా, ఎండి సుమేవ, శాయిదా, జరీనా, అనీఫా,, ఫిరోజా, అనీష్, షబానా, సమీనా, శంశీనా, గౌతమి తదితరులు పాల్గొన్నారు.



