కామారెడ్డి, 22 సెప్టెంబర్,పున్నమి ప్రతినిధి :
ఊహించని వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న కామారెడ్డి జిల్లా ప్రజలకు సహాయం చేయడానికి, తెలంగాణ పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ముందుకు వచ్చింది. వరద సహాయ నిధి కోసం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కు (ఏడు లక్షల ఆరు వేల పదకొండు రూపాయ లు) విలువైన డీడీని ఈ రోజు కలెక్టరేట్‌లో అందజే శారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, తెలంగాణ పిఆర్టి సంఘ సభ్యులు, జిల్లా బాధ్యుల ను అభినందించారు. ఆపదలో ఆదుకోవడానికి ముందుకు వచ్చిన మీరు ఇతర సంఘాలకు ఆద ర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇలాంటి సామా జిక కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి జిల్లా అభి వృద్ధికి తోడ్పడాలని సూచించారు. పీటిఆర్టి యు జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుశాల్ మాట్లాడుతూ, తమ సంఘం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారా నికే కాకుండా, సామాజిక కార్యక్రమాలలో ముందుంటుందని చెప్పారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. ముఖ్యంగా 39 పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక వసతులు కల్పించడం, రెడ్ క్రాస్ సౌజన్యంతో 6 సార్లు రక్తదా న శిబిరాలు నిర్వహించి 900కు పైగా బ్లడ్ యూని ట్లు సేకరించడం, కరోనా సమయంలో 22 రోజుల పాటు నిరంతరాయంగా 200 మందికి అన్నదానం చేయడం, ప్రతి మండల శాఖ పేదలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం వంటి కార్యక్రమాల ను వివరించారు.ఈ కార్యక్రమాలకు సహకరించిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర సంఘ అధ్యక్షు లు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భీష్మ గౌడ్, పెద్దలు బి. మోహన్ రెడ్డి, పి. వెంకట్ రెడ్డి, వంగ మహేందర్ రెడ్డి, గుండు లక్ష్మణ్ లకు ధన్యవా దాలు తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని మండలా ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, బాధ్యులకు, ప్రాథమిక సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోడీఈఓ రాజు, టి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహాధ్యక్షులు జే. మధుసూదన్ రెడ్డి, సంగారెడ్డి, గోవర్ధన్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మండ్లు, రమణ, రామచం ద్ర రెడ్డి, ప్రసాద్, సంతోష్ లతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బాధ్యులు పాల్గొన్నారు.


