Thursday, 5 February 2026
  • Home  
  • టిడిపి కార్యకర్తలకు అండగా గంటా రవితేజ*
- విశాఖపట్నం

టిడిపి కార్యకర్తలకు అండగా గంటా రవితేజ*

*టిడిపి కార్యకర్తలకు అండగా గంటా రవితేజ* *కష్టంలో ఉన్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి భరోసా – యువనేత సేవాభావానికి ప్రశంసలు* *విశాఖపట్నం డిసెంబర్ 14పున్నమి ప్రతినిధి* ఎన్నికల సమయంలో కార్యకర్తల ఇళ్ల చుట్టూ తిరిగి హామీలు ఇచ్చే నాయకులను మనం తరచూ చూస్తుంటాం. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కార్యకర్తల కష్టసుఖాలను పట్టించుకోని పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులకు భిన్నంగా, టిడిపి యువనేత, మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు *గంటా రవితేజ* తన సేవాభావంతో కార్యకర్తల మనసులు గెలుచుకుంటున్నారు. మధురవాడ 5వ వార్డు వైయస్సార్ కాలనీలో నివసిస్తున్న పక్కి విష్ణుమూర్తి అనే సామాన్య టిడిపి కార్యకర్త ఇటీవల పక్షవాతం బారిన పడడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యువనేత గంటా రవితేజ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, “నీకు ఏ అవసరం ఉన్నా నేను అండగా ఉంటాను” అంటూ భరోసా కల్పించారు. నాయకుడు స్వయంగా తమ ఇంటికి వచ్చి పరామర్శించడంతో ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. అదేవిధంగా, అదే వార్డుకు చెందిన వాసు అనే మరో టిడిపి కార్యకర్త ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న గంటా రవితేజ మధ్యాహ్న భోజన సమయం అయినప్పటికీ కార్యకర్త కోసం ఎదురుచూసి, ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి నాయకుడు నేరుగా రావడం చూసి ఆ కార్యకర్తలు కన్నీటి పర్యంతమై యువనేతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకొని వారికి భరోసా కల్పించడం ఒక నిజమైన నాయకుడి లక్షణమని, ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమని పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. గంటా రవితేజ చూపిస్తున్న ఆత్మీయతకు తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, యార్లగడ్డ జీవన్, ఓలేటి శ్రావణ్, వంక నూకరాజు, మొదలవలస సరస్వతి, మాధవ, కురుమోజి శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*టిడిపి కార్యకర్తలకు అండగా గంటా రవితేజ*

*కష్టంలో ఉన్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి భరోసా – యువనేత సేవాభావానికి ప్రశంసలు*

*విశాఖపట్నం డిసెంబర్ 14పున్నమి ప్రతినిధి*

ఎన్నికల సమయంలో కార్యకర్తల ఇళ్ల చుట్టూ తిరిగి హామీలు ఇచ్చే నాయకులను మనం తరచూ చూస్తుంటాం. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కార్యకర్తల కష్టసుఖాలను పట్టించుకోని పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులకు భిన్నంగా, టిడిపి యువనేత, మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు *గంటా రవితేజ* తన సేవాభావంతో కార్యకర్తల మనసులు గెలుచుకుంటున్నారు.

మధురవాడ 5వ వార్డు వైయస్సార్ కాలనీలో నివసిస్తున్న పక్కి విష్ణుమూర్తి అనే సామాన్య టిడిపి కార్యకర్త ఇటీవల పక్షవాతం బారిన పడడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యువనేత గంటా రవితేజ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, “నీకు ఏ అవసరం ఉన్నా నేను అండగా ఉంటాను” అంటూ భరోసా కల్పించారు. నాయకుడు స్వయంగా తమ ఇంటికి వచ్చి పరామర్శించడంతో ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.

అదేవిధంగా, అదే వార్డుకు చెందిన వాసు అనే మరో టిడిపి కార్యకర్త ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న గంటా రవితేజ మధ్యాహ్న భోజన సమయం అయినప్పటికీ కార్యకర్త కోసం ఎదురుచూసి, ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి నాయకుడు నేరుగా రావడం చూసి ఆ కార్యకర్తలు కన్నీటి పర్యంతమై యువనేతకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకొని వారికి భరోసా కల్పించడం ఒక నిజమైన నాయకుడి లక్షణమని, ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమని పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. గంటా రవితేజ చూపిస్తున్న ఆత్మీయతకు తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, యార్లగడ్డ జీవన్, ఓలేటి శ్రావణ్, వంక నూకరాజు, మొదలవలస సరస్వతి, మాధవ, కురుమోజి శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.