ఖమ్మం ఫిబ్రవరి
( పువ్వాడ నాగేంద్ర కుమార్
జిల్లా ఇంచార్జి)
ఖమ్మం: గత నెలలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుపై సిట్ అధికారులు చేపట్టిన విచారణను నిరసిస్తూ ఖమ్మం నగరంలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
వైరా నుంచి ఖమ్మంకు వస్తున్న నాగరాజును పోలీసులు అడ్డుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సుమారు 22 రోజులుగా ఖమ్మం జిల్లా జైలులో ఉన్న నాగరాజుకు గురువారం బెయిల్ మంజూరవగా, శుక్రవారం ఉదయం విడుదలయ్యారు.
జైలు నుంచి బయటకు వచ్చిన నాగరాజుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కత్తి శ్రీను, నాగేశ్వరరావు, రాజేష్, తిరుమల రావు పూలపొంగు వెంకట్, ఉపేందర్, రమేష్ సహా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకి పూల మాలలు వేసి ఘనం స్వాగతం పలికారు .
నాగరాజు విడుదలతో ఆయన అనుచరుల్లో ఆనందం నెలకొంది.


