పున్నమి ప్రతి నిధి
హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు అయిన ఈరోజు భారీగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. అధికారులు తెలిపిన ప్రకారం, మూడు గంటల తర్వాత కూడా వచ్చే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించలేమని పేర్కొన్నారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. తదుపరి అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


