
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కొలువైన శ్రీశ్రీశ్రీ దుర్గా అమ్మవారి వార్షిక మహోత్సవ వేడుకలు జీవీఎంసీ ఉద్యోగులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో బాణాసంచాలు, గరిడీ, వాయిద్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు, ఉద్యోగులు అమ్మవారికి ధూప దీపాలతో పాటు నైవేద్యం సమర్పించి వేడుకలలో పాల్గొన్నారు.
ఈ వేడుకలలో జీవీఎంసీ ఆలయ కమిటీ సభ్యులైన ఓమ్మి సురేష్, జగన్, రాజేష్, ప్రకాష్, భాస్కర్, అప్పలరాజు, వాసు, రాజ్ గణేష్, ప్రశాంతి తదితర ఇతర జీవీఎంసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

