*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం*
తేదీ: 22.10.2025
*శాశ్వత ప్రాతిపదికన ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలి….*
*ఆలయ ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించాలి….*
*రేడిమేడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలి….*
*పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి….*
*హెల్త్ క్యాంప్, పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేయాలి…..*
*ఆలయ అభివృద్ధిలో ప్రజలు, దాతలు భాగస్వాములు కావాలి….*
*జీడికల్ ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి శాశ్వత ప్రాతిపదికన 5నుండి 10కోట్లతో పనులు చేపట్టెందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తెలిపారు.*
వచ్చే నెల లో జరగనున్న లింఘాల ఘనపూర్ మండలం జీడికల్ శ్రీరామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చేపట్టాలిసిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆలయం వద్ద స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్షా సమావేశం నిర్వహించారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. వచ్చే నెల 4 వ తేదీ నుండి 17 వరకు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వచ్చే నెల 10 వ తేదీన జరిగే స్వామి కల్యాణనికి అన్ని శాఖల అధికారులు సమన్వయము గా పని చేయాలని అన్నారు. గుడి పక్కన ఆలయ ప్రహరీ గోడ నుండి గుండం వరకు మెట్లు, రెండు గుండాల వద్ద ఫెన్సింగ్, గ్రామం నుండి ఆలయానికి వచ్చేందుకు సీసీ రోడ్, కల్యాణ మండపం వద్ద పిచ్చి చెట్లను తొలగింపు,ల్యాండ్ లేవలింగ్ తదితర పనులను వెంటనే చేపట్టాలని తెలిపారు.
అటవీ శాఖ అధికారుల సహకారంతో స్వామి నిత్య కైంకార్యానికి పూల తోట ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ సమీపం అంత శుభ్రంగా గా చేసి…. నీడ ను ఇచ్చే చెట్ల ను పెట్టి… పచ్చదనం తో ఆలయ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్, రెడీ మెడ్ గా ఉండే
టాయిలెట్స్ లను అందుబాటులో పెట్టాలని వెల్లడించారు. శానిటేషన్ పక్కాగా జరగాలని, 24 గంటలు తాగు నీరు, విద్యుత్, మెడికల్ క్యాంపు, పోలీస్ భద్రత ఉండాలని అధికారులకు సూచించారు.
నవంబర్ 3 వ తేదీ వరకు అన్ని పనులు అయిపోవాలని తెలిపారు. మున్ముందు జీడికల్ దేవస్థానంకి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేసి శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో ప్రజలు, దాతలు కూడా భాగస్వామ్యం కుడా ఉండాలని కోరారు.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ…. వివిధ శాఖల సమన్వయంతో గత జాతరను విజయవంతంగా నిర్వహించామని…. ప్రత్యేక దృష్టితో ఈసారి కూడా అన్ని శాఖల అధికారులు వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలు సజావుగా జరిగేందుకు జనగామ RDO గోపీరామ్ ని స్పెషల్ అధికారిగా నియమించామని… అలాగే కంట్రోల్ రూమ్ రూమును కూడా ఏర్పాటు చేసి ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తగు చర్యలు తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. సీసీ రోడ్, మెట్లు, బుష్ క్లియరెన్స్, తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని… ఎక్కువ శానిటేషన్ వర్కర్స్ పెట్టి ఆలయ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేల చూడాలని డిపిఓ ని ఆదేశించారు.
శాశ్వతంగా కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ నిర్మాణంకి కుడా చర్యలు తీసుకుంటామని, మెడికల్ సిబ్బంది, మెడిసన్స్, అంబులెన్స్ అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి తెలిపారు ఫైర్ సేఫ్టీ తీసుకోవాలని, ఎక్కువ బస్ లు తిరిగేలా
RTC అధికారులు చూడాలని, గత జాతర సందర్బంగా శాశ్వతంగా ట్రాన్స్ఫర్మ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రోటోకల్ సమస్యలు రాకుండా,చైన్ స్నాచింగ్ జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. క్లోరినేషన్ చేస్తూ ఉండాలని, రోజుకి 3 సార్లు టెస్ట్ చేస్తూ… తాగు నీరు
ఎలాంటి కలుషితం జరగకుండా చూడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ రాజా మహేందర్ నాయక్, ఆర్డీ వో గోపిరామ్, డిపిఓ స్వరూప, ఆలయ చైర్మన్ నరసింహులు, ఆలయ కార్య నిర్వహణ అధికారి వంశీ, డైరెక్టర్ లు,విద్యుత్, ఇంజనీరింగ్, మెడికల్ తదితర శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


