….జిల్లా జాయింట్ కలెక్టరు అదితి సింగ్
కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికేప్రారంభమైన.మైదుకూరు,కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంత ఉల్లి రైతులు సద్వినియోగంచేసుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్,జాయింట్ కలెక్టర్ అదితిసింగ్.పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో రైతుల నుండి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియపై.జిల్లా ఇంచార్జి కలెక్టరు,జేసీ అదితి సింగ్ సంబంధిత ఉద్యాన,మార్క్ ఫెడ్ శాఖల అధికారులతోసమీక్షించారు.ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టరు మాట్లాడుతూ.ఒక క్వింటాల్ ఉల్లి ధర రూ.1200 /- ప్రకారం e-క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుండి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఉల్లి పంటను కొనుగోలు చేయడం జరుగుతోందన్నారు.జిల్లాలోని మైదుకూరు,కమలాపురం నియోజకవర్గ కేంద్రాల్లోని మార్కెట్ యార్డుల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉల్లి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోలు ప్రారంభించడం జరిగిందన్నారు.జిల్లాలోని ఉల్లి రైతులకు ఎలాంటి నష్టంవాటిల్లకుండా,నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఈకొనుగోలుప్రక్రియనుప్రణాళికాబద్ధంగా,పకడ్భందీగానిర్వహిస్తున్నట్లు జేసీ తెలిపారు.ఈ అవకాశాన్ని జిల్లాలోని ఉల్లిపంట పండించిన ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహనపెంచాలన్నారు.జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు,జిల్లా మార్క్ ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి,మార్కెటింగ్ ఎడి ఆజాద్ వలి తదితరులు పాల్గొన్నారు


