*జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి*
*అధికారులకు, దాతలకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి
*విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి * జిల్లాలోని పేదలకు, అనారోగ్య బాధితులకు సాయం చేయాలనే దృక్పథంతో నెలకొల్పిన సంజీవని నిధి – డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ కు స్వచ్ఛంద విరాళాలు అందించాలని, అధికారులను, దాతలను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరం – 2026కు స్వాగతం పలికే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మానవీయమైన, అర్థవంతమైన సంప్రదాయాన్ని ఈ ఏడాదీ కొనసాగించాలని విన్నవించారు. అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలపడం సందర్భంగా పూలు, పండ్లు, కేకులు, మొక్కలు తదితరాలను అందించడం కన్నా.. ‘సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి’కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని ప్రత్యేక సందేశం ద్వారా సోమవారం విజ్ఞప్తి చేశారు. ‘సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి’ ద్వారా సేకరించిన విరాళాలు జిల్లాలోని అవసరమైన, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ మానవీయ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ద్వారా, సమాజంలో బాధితులకు అండగా నిలవడంతో పాటు, సామాజిక బాధ్యతకు ఆదర్శంగా నిలవగలమని ఆయన పేర్కొన్నారు. ఈ విరాళాలు పూర్తిగా స్వచ్ఛందమైనవని స్పష్టం చేస్తూ, సేవాభావంతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
విరాళాలకు సంబంధించిన వివరాలు:
నిధి పేరు: SANJEEVANI NIDHI – District Relief Fund
ఖాతా సంఖ్య: 50100500766040
బ్యాంకు & IFSC: HDFC Bank – HDFC0009179


