శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై కలెక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యా, వైద్య రంగాల్లో చేపట్టాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయికి చేరాలని కోరారు. ఎమ్మెల్యే విన్నపంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ ప్రయోజనాల కోసం, అభివృద్ధి పనుల వేగవంతానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ భేటీ నియోజకవర్గ అభివృద్ధికి కీలక ముందడుగని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భేటీ-అభివృద్ధి పనులపై చర్చ
శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై కలెక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యా, వైద్య రంగాల్లో చేపట్టాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయికి చేరాలని కోరారు. ఎమ్మెల్యే విన్నపంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ ప్రయోజనాల కోసం, అభివృద్ధి పనుల వేగవంతానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ భేటీ నియోజకవర్గ అభివృద్ధికి కీలక ముందడుగని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

