నెల్లూరు 09.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️
నెల్లూరు నగరంలోని దర్గామిట్ట నందు గల జెడ్పి హాల్లో మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా క్వారంటైన్ వార్డులు,ఐసోలేషన్ వార్డులలో అందిస్తున్న వైద్య సదుపాయాలు,సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాలు,మన రాష్ట్రం నుంచి రాకపోకలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు పాల్గొన్నారు.