సోమవారం నాడు రాజమహేంద్రవరం ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించబడిన ఆల్ ఇండియన్ ఇంటర్ యూనివర్సిటీ సెలెక్షన్స్ లో వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.డి. చెన్నారావు ప్రోద్భలంతో కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జ్ శ్రీ రాయుడు శ్రీను గారు కళాశాల మొదటి సంవత్సరం కెమిస్ట్రీ విభాగం నుండి వై. కృష్ణార్జుస్ మరియు ఎమ్. దుర్గా ప్రసాద్ విధ్యార్ధులను రిజిలింగ్(కుస్తీ) 57 కేజ్ కేటగిరీ పోటీకి పంపించడం జరిగింది. ఈ సెలెక్షన్స్ విభాగంలో జగ్గంపేట విద్యార్థులు వై. కృష్ణార్జున్ మొదటి స్థానాన్ని (Gold medal) మరియు ఎమ్. దుర్గా ప్రసాద్ తృతీయ స్థానాన్ని (Bronze medal) కైవసం చేసుకుని తమ ప్రతిభను దాటారు. మొదటి స్థానం సాదించిన వై. కృష్ణార్జుస్ జాతీయ స్థాయి రిజిలింగ్ పోటీలకు ఎంపికయ్యి జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల యొక్క కీర్తిని జాతీయ స్థాయిలో నిలపడం జరిగింది. వై. కృష్ణార్జుస్ జనవరి 2026 లో జాతీయ స్థాయిలో జరిగే రిజిలింగ్ పోటీలకు చండీఘర్ (పంజాబ్) లో పాల్గొంటాడని ప్రిన్సిపల్ గారు తెలిపారు.
తేదీ 04-11-2025, మంగళవారం నాడు కళాశాలలో ప్రిన్సిపల్ డా. డి. చెన్నారావు గారు విజయం సాధించి కళాశాల కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపిన విధ్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంధార్బంగా కళాశాల ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ విజయం సాదించిన విధ్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలని ఆశీర్వదించారు, ప్రతి విధ్యార్థి వీరిని ఆదర్శంగా తీసుకుని క్రీడారంగంలో తమ ప్రతిభను చాటాలని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ.సి. హెచ్. బాలరాజు గారు, ఐ. క్యూ.ఏ. సి కో-ఆర్డినేటర్ డా. పి.వి.వి. సత్యా నారాయణ గారు, కెమిస్ట్రీ అధ్యాపకులు వి. మల్లికార్జున శర్మ గారు, హిస్టరీ అద్యాపకులు ఆర్. శ్రీనుగారు, తెలుగు అధ్యాపకులు, డా. డి.సత్యలత గారు, గణిత ఆధ్యాపకులు సి.హెచ్.ఝాన్సీరాణి గారు, ఫిజిక్స్ అధ్యాపకులు వి.గోపాల కృష్ణ గారు, కామర్స్ ఆద్యాపకులు డా.జి. సురేష్ , పి.పద్మ శేఖర్ గll, కె. వెంకట రావు, కంప్యూటర్ ఆధ్యాపకులు వి. దేవి ప్రసన్న , జువాలజీ ఆద్యాపకులు పి.శ్రీనివాస రావు, బొటాని అధ్యాపకులు వై. నవీన ఇతర అద్యపకేతర సిబ్బంది మరియు విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.


