Thursday, 12 February 2026
  • Home  
  • *జల్పల్లిలో మురుగునీటి శుద్ధి కేంద్రానికి శంకుస్థాపన చేసిన..సబితా ఇంద్రారెడ్డి *
- రంగారెడ్డి

*జల్పల్లిలో మురుగునీటి శుద్ధి కేంద్రానికి శంకుస్థాపన చేసిన..సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 :మహేశ్వరం నియోజకవర్గంలోని జలపల్లి మున్సిపాలిటీ – హుందాసాగర్ సమీపంలో 46 కోట్ల వ్యయంతో 23 ఎం ఎల్ డి (ఎస్.టి.పీ ) నిర్మాణ పనులకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు మొత్తం 31 (ఎస్.టి.పీ )లు మంజూరు కాగా అందులో మహేశ్వరం నియోజకవర్గానికి 151 కోట్ల నిధులతో తో నాలుగు (ఎస్.టి.పీ) లు ఆమోదం పొందినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలు 2022లోనే సిద్ధమైనవని పేర్కొన్నారు.చెరువులు మురికి కూపాలుగా మారుతున్న నేపథ్యంలో, వాటిని మళ్లీ సస్యశ్యామలంగా మార్చేందుకు ఎస్.టి.పీల ద్వారా శుద్ధిచేసిన నీటిని చెరువుల్లోకి మళ్లించే పనులు చేపడుతున్నామన్నారు. ఎస్.టి.పీలు పూర్తికావడంతో నియోజకవర్గ చెరువుల పునరుద్ధరణకు, పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంతేకాకుండా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఉన్నటువంటి చెరువుల కూడా అతి త్వరలోనే ఇట్టి ఎస్.టి.పీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎమ్డబ్ల్యూఎస్బి అధికారులు — సిజిఎం సుజాత, డీజీఎం రాజ్కుమార్, భానుచందర్, మేనేజర్ తదితరులు మరియు జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 :మహేశ్వరం నియోజకవర్గంలోని జలపల్లి మున్సిపాలిటీ – హుందాసాగర్ సమీపంలో
46 కోట్ల వ్యయంతో 23 ఎం ఎల్ డి (ఎస్.టి.పీ ) నిర్మాణ పనులకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు మొత్తం 31 (ఎస్.టి.పీ )లు మంజూరు కాగా
అందులో మహేశ్వరం నియోజకవర్గానికి 151 కోట్ల నిధులతో తో నాలుగు (ఎస్.టి.పీ)
లు ఆమోదం పొందినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలు 2022లోనే సిద్ధమైనవని పేర్కొన్నారు.చెరువులు మురికి కూపాలుగా మారుతున్న నేపథ్యంలో, వాటిని మళ్లీ సస్యశ్యామలంగా మార్చేందుకు ఎస్.టి.పీల ద్వారా శుద్ధిచేసిన నీటిని చెరువుల్లోకి మళ్లించే పనులు చేపడుతున్నామన్నారు. ఎస్.టి.పీలు పూర్తికావడంతో నియోజకవర్గ చెరువుల పునరుద్ధరణకు, పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంతేకాకుండా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఉన్నటువంటి చెరువుల కూడా అతి త్వరలోనే ఇట్టి ఎస్.టి.పీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎమ్డబ్ల్యూఎస్బి అధికారులు — సిజిఎం సుజాత, డీజీఎం రాజ్కుమార్, భానుచందర్, మేనేజర్ తదితరులు మరియు జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.