గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
దువ్వాడలో జనసాంద్రత ఉన్న నివాస ప్రాంతం నడుమ సెల్ఫోన్ టవర్ ఏర్పాటు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా టవర్ నిర్మాణం సాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, గర్భిణీలు, వృద్ధుల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా, ముందస్తు ప్రజాభిప్రాయం లేకుండా టవర్ పనులు చేపట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే విషయంపై అధికార యంత్రాంగం మౌనం వహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే టవర్ పనులు నిలిపివేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.


