Monday, 6 April 2026
  • Home  
  • జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగింపు – విపరీత స్పందనతో నిర్ణయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగింపు – విపరీత స్పందనతో నిర్ణయం

జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గాలు అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున యువత, మహిళలు, సామాన్య ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలు మరియు నియోజకవర్గాల నుంచి కార్యక్రమాన్ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని పార్టీ కేంద్ర కార్యాలయానికి విస్తృతంగా అభ్యర్థనలు అందాయి. ఈ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయించింది. పార్టీ వర్గాల ప్రకారం, ప్రజల నుంచి వస్తున్న ఈ విశేష స్పందన పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. కొత్తగా చేరుతున్న సభ్యులు పార్టీ బలోపేతానికి దోహదం చేస్తారని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఇది బలమైన పునాది అవుతుందని నాయకులు తెలిపారు. పొడిగించిన గడువులో మరింత మంది ప్రజలు సభ్యత్వం నమోదు చేసుకుని జనసేన కుటుంబంలో చేరాలని పార్టీ పిలుపునిచ్చింది.

జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గాలు అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున యువత, మహిళలు, సామాన్య ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలు మరియు నియోజకవర్గాల నుంచి కార్యక్రమాన్ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని పార్టీ కేంద్ర కార్యాలయానికి విస్తృతంగా అభ్యర్థనలు అందాయి.
ఈ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయించింది.
పార్టీ వర్గాల ప్రకారం, ప్రజల నుంచి వస్తున్న ఈ విశేష స్పందన పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. కొత్తగా చేరుతున్న సభ్యులు పార్టీ బలోపేతానికి దోహదం చేస్తారని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఇది బలమైన పునాది అవుతుందని నాయకులు తెలిపారు.
పొడిగించిన గడువులో మరింత మంది ప్రజలు సభ్యత్వం నమోదు చేసుకుని జనసేన కుటుంబంలో చేరాలని పార్టీ పిలుపునిచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.