*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*:
విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో
*జగన్మోహన్ రెడ్డి పై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫైర్.*
*ఎంపీ కలిశెట్టి అప్పలcనాయుడు మాట్లాడుతూ*
పులివెందుల ఎమ్మెల్యే జగన్ స్ట్రిప్ట్ ప్రసంగం చూసాం…అన్ని అవస్తవాలే మాట్లాడారు.
5 కోట్ల ఆంధ్రుడు తో పాటు తలదించుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి.
విశాఖలో డేటా సెంటర్ పై ఆయన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి.
కత్తులు పట్టుకున్నవారికి కంప్యూటర్ కోసం ఏమి తెలుసు.
డేటా సెంటర్ కు మీరు శంకుస్థాపన చేస్తే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు.
విశాఖకు డేటా సెంటర్ రావడం జగన్ కి ఇష్టం ఉందా లేదా చెప్పాలి.
జగన్ సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు ను ఘోరంగా అవమానించారు.
జగన్ లా చంద్రబాబు వన్ టైమ్ సి ఎం కాదు ఫోర్త్ టైమ్ సీఎం.
హైదరాబాద్ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు..అక్కడ అభివృద్ధి బాబు చలవే
ఈ విషయాన్ని ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..అటు బిఆర్ ఎస్ నేతలు ఒప్పుకుంటున్నారు.
పరిపాలన రాజధాని పేరుతో వైసిపి నేతలు విశాఖను దోచుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సర్వ నాశనం అయింది.
చంద్రబాబు ను చూసి ఏపీకి పెట్టుబడులు వస్తుంటే రావద్దని మెయిల్స్ పెడుతున్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు.
మద్యం పై మాట్లాడే నైతిక హక్కు వైసిపి నేతలకు లేదు
ఈ సమావేశంలో బ్రహ్మ రాజు, అశోక్ , పి జయరాజ్ జాన్, తదితరులు పాల్గొన్నారు,


