Saturday, 11 April 2026
  • Home  
  • చీకుడు గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన యువత
- రాజన్న సిరిసిల్ల

చీకుడు గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన యువత

ముస్తాబాద్ ఏప్రిల్ 11 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలం చికోడు గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు , నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భరతమాత ముద్దుబిడ్డగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన ఫూలే గారు సామాజిక సంస్కరణలకు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శిగా, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలు కల్పించేందుకు జీవితమంతా పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. ఫూలే గారి సేవలు సమాజ ప్రగతికి నిత్యం స్పూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజలు ., ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా, ఐక్యతకు ప్రతీకగా కన్నుల పండుగగా జరిగింది.

ముస్తాబాద్ ఏప్రిల్ 11 పున్నమి ప్రతినిధి

ముస్తాబాద్ మండలం చికోడు గ్రామంలో
మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు , నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భరతమాత ముద్దుబిడ్డగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన ఫూలే గారు సామాజిక సంస్కరణలకు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శిగా, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలు కల్పించేందుకు జీవితమంతా పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు.
ఫూలే గారి సేవలు సమాజ ప్రగతికి నిత్యం స్పూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజలు ., ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా, ఐక్యతకు ప్రతీకగా కన్నుల పండుగగా జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.