మర్రిపాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ రథసారథి చిన్నా జనసేన సారథ్యంలో 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మర్రిపాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచ్‌ను ప్రారంభించారు. అనంతరం మండల సెంటర్లో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నా జనసేన మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా జనసేన పార్టీ బలోపేతం కోసం తన సాయశక్తులా పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన, కూరాకు శైలేంద్ర కుమార్, మొద్దు పెంచలయ్య, కృష్ణ కుమార్, వెంకట రమణ, యజ్ఞ శ్రీ, నిత్య శ్రీ, దక్షిత, తిరుపతయ్య, మొద్దు వెంగమ్మ, కూటమి నాయకులు పఠాన్ దండు అశోక్ తదితర జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



